iDreamPost
android-app
ios-app

యూరప్ ట్రిప్‌లో స్టార్ జంటకు చేదు అనుభవం! పాపం రోడ్డుపైకి వచ్చేశారు!

పెళ్లి రోజు జరుపుకునేందుకు యూరప్ వెళ్లిందో స్టార్ జంట. సోషల్ మీడియాలో ఆ ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. అంతలో ఈ జంటకు చేదు అనుభవం ఎదురైంది.

పెళ్లి రోజు జరుపుకునేందుకు యూరప్ వెళ్లిందో స్టార్ జంట. సోషల్ మీడియాలో ఆ ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. అంతలో ఈ జంటకు చేదు అనుభవం ఎదురైంది.

యూరప్ ట్రిప్‌లో స్టార్ జంటకు చేదు అనుభవం! పాపం రోడ్డుపైకి  వచ్చేశారు!

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ అలరించాయి. ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. నేరుగా తెలుగు సీరియల్స్ మాత్రమే కాకుండా అటు తమిళ్, ఇటు హిందీ డబ్బింగ్ సీరియల్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడంటే సీరియల్స్ కూడా రీమేక్ అవుతున్నాయి కానీ.. ఒకప్పుడు హిందీ డబ్బింగ్ సీరియళ్లదే హహ. హిందీ సీరియల్స్‌కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. చిన్నారి పెళ్లి కూతురు, చూపులు కలిసిన శుభవేళ, అత్తలేని కోడలు ఉత్తమురాలు, ఈతరం ఇల్లాలు, కోడలా కోడలా కొడుకు పెళ్లామా, నాగిని, కుంకుమ భాగ్య వంటి ధారావాహికలు ఆకట్టుకున్నాయి. ఇలాంటి మరో సీరియల్ మనసు పలికే మౌనగీతం (యే హై మొహబ్బత్తీన్). ఇందులో మెయిన్ రోల్‌లో నటించింది దివ్యాంక త్రిపాఠి. బుల్లితెర సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఒకానొక టైంలో టెలివిజన్ హాటెస్ట్ యాక్ట్రెస్ జాబితాలో చోటు దక్కించుకుంది.

2016లో కో స్టార్ వివేక్ దహియాను వివాహం చేసుకుంది. ఇద్దరు స్మాల్ స్క్రీన్లపై సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎనిమిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియాలు ఇటీవల యూరప్ విహార యాత్రకు వెళ్లారు. స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేసిన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఈ ట్రిప్‌లో వారికొక చేదు అనుభవం ఎదురైంది. ఫ్లోరెన్స్ పర్యటనలో వీరి వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. వీరిపై ఎటువంటి భౌతిక దాడి జరగలేదు కానీ.. పాస్ పోర్టులతో పాటు రూ. 10 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని వివేక్ మీడియాతో వెల్లడించాడు. ఫోర్లెన్స్‌లో ఓ రోజు ఉండేందుకు ప్లాన్ చేసుకుంటుంగా.. వస్తువులన్నీ కారులో ఉంచి..ఇల్లు వెతుకుతున్నారు.

తిరిగి వస్తువులు తీసుకునేందుకు కారు వద్దకు రాగా.. అద్దాలు పగులగొట్టి.. పాస్ పోర్ట్స్, పర్సులు, డబ్బు, షాపింగ్ చేసిన వస్తువులు మాయమైనట్లు వివేక్ వెళ్లడించాడు. వీటి విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని వెల్లడించాడు. కానీ కొన్ని పాత బట్టలు, ఆహార పదర్ధాలను కారులో వదిలేశారని చెప్పాడు. తాము స్థానిక పోలీసులను ఆశ్రయించామని, కానీ ఎలాంటి సాయం దొరకలేదని తెలిపాడు. నిర్థిష్ట ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేనందున తమకు ఎటువంటి సహాయం చేయలేమని స్థానిక పోలీసులు చేతులెత్తేశారని, రాయబార కార్యాయలయాన్ని సంప్రదించగా.. అది క్లోజ్ అయినట్లు చెప్పాడు. తమకు హోటల్ సిబ్బంది సహాయం చేశారని, తమకు అత్యవసరంగా రాయబార కార్యాలయం నుండి సాయం కావాలని వేడుకున్నారు ఈ జంట. ఇండియాకు తిరిగి వెళ్లేందుకు మాకు తాత్కాలిక పాస్‌పోర్ట్‌లు అందించేలా ఎంబసీ సాయం చేయాలని కోరారు.