iDreamPost
android-app
ios-app

16 ఏళ్లకే స్టార్‌ హీరోయిన్‌.. మూడేళ్ల తర్వాత ఊహించని రీతిలో..

ఇండస్ట్రీలో వివాదాలకు, డెత్‌ మిస్టరీలకు కొదువ లేదు. అలాంటి డెత్‌ మిస్టరీల్లో దివ్య భారతీది మొదటి స్థానంలో ఉంటుంది. దివ్య భారతి అనుమానస్పదంగా మృతి చెంది ఇప్పటికి 30 ఏళ్లు అవుతోంది. అయినా ఆమె మరణానికి గల సరైన కారణం ఇప్పటికీ మిస్టరీనే..

ఇండస్ట్రీలో వివాదాలకు, డెత్‌ మిస్టరీలకు కొదువ లేదు. అలాంటి డెత్‌ మిస్టరీల్లో దివ్య భారతీది మొదటి స్థానంలో ఉంటుంది. దివ్య భారతి అనుమానస్పదంగా మృతి చెంది ఇప్పటికి 30 ఏళ్లు అవుతోంది. అయినా ఆమె మరణానికి గల సరైన కారణం ఇప్పటికీ మిస్టరీనే..

16 ఏళ్లకే స్టార్‌ హీరోయిన్‌.. మూడేళ్ల తర్వాత ఊహించని రీతిలో..

1993 ఏప్రిల్‌ 5వ తేదీ రాత్రి..
ముంబై, అంథేరీ వెస్ట్‌.. తులసీ బిల్డింగ్స్‌..

ఏమైందో ఏమో తెలీదు.. దివ్య భారతి ఐదో ఫ్లోర్‌లోని తన ప్లాట్‌ బాల్కనీ నుంచి కిందపడింది. ఆమె తల బలంగా నేలను తాకటంతో వైద్య సహాయం అందే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. దివ్య భారతిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. దివ్య భారతి చనిపోయిన వార్త క్షణాల్లో బయటకు పొక్కింది. అంతే.. ఒక్కసారిగా సినీ ప్రపంచంతో పాటు.. సాధారణ జనాలు షాక్‌ అయ్యారు. ఆ రోజు ఆమెతో కలిసి పని చేసిన వారి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మరుసటి రోజు పెద్ద పెద్ద హెడ్డింగులతో పేపర్లలో ‘‘ ది ట్రాజడీ దట్‌ షుక్‌ ది నేషన్‌.. ’’.. ‘‘ యాక్ట్రెస్‌ దివ్య భారతీ ఫాల్‌ టూ డెత్‌’’ అంటూ వార్తలు వచ్చాయి. అయితే, దివ్య భారతి మరణానికి సరైన కారణాలు పోలీసులకు కూడా తెలీదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కానీ, దివ్య భారతిని ఎవరో కావాలని బిల్డింగ్‌పైనుంచి కిందకు తోసి చంపేశారన్న వార్తలు బయటకు వచ్చాయి. ఆ సమయంలో అందరి చూపు దివ్య భారతి భర్త సాజిద్‌ నదియావాలాపైకి వెళ్లింది.

16 ఏళ్లకే సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌ అయిన దివ్య భారతి 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. అప్పటి ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత సాజిద్‌ నదియా వాలాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘‘షోలా ఔర్‌ షబ్‌న్నమ్‌’’ సినిమా సమయలో ఇద్దరికీ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ సినిమా అయిపోయినా ఇద్దరూ తరచుగా కలుసుకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. సాజిద్‌తో పెళ్లి కోసం దివ్య భారతి మతం మారింది. తన పేరును సనా నదియావాలాగా మార్చుకుంది. 1992, మే 10 వీరు కోర్టు పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.

పెళ్లి అయిన కొన్ని రోజులు సజావుగానే సాగిన వీరి కాపురంలో తర్వాతినుంచి గొడవలు జరగటం మొదలయ్యాయి. ఇద్దరూ తరచుగా గొడవలు పడేవారని, సాజిద్‌.. దివ్య భారతిని తీవ్రంగా కొట్టేవాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. 1992లో ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్య భారతీ తన వైవాహిక జీవితంపై వస్తున్న పుకార్లపై ఓ క్లారిటీ ఇచ్చింది. భర్తతో ఎలాంటి గొడవలు లేవని చెప్పింది.

ఆ ఇంటర్వ్యూలో .. ‘‘ బయట జనం నన్ను చాలా దారుణమైన మనిషినని అనుకుంటున్నారు. వారు అనుకున్న విధంగా అయి ఉంటే.. నా భర్త సాజిద్‌ నాతో ఎందుకు ఉంటాడు. మేమిద్దరం దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాము. సాజిద్‌ చాలా పరిపక్వత కలిగిన మనిషి. ఆయన తన జీవితంలో ఎన్నో చూశారు. నేను చిన్నపిల్లలా ప్రవర్తించిన ప్రతీసారి.. ఆయన నాకు అన్ని విషయాలు వివరించి చెప్పేవారు. తప్పు ఏదో ఒప్పు ఏదో చెప్పేవారు. ఆయన జడ్జిమెంట్‌ విషయంలో నా అంచనా ఎప్పుడూ తప్పలేదు’’ అని అన్నారు.

అయితే, ఇంటర్వ్యూ ఇచ్చిన కొన్ని నెలల తర్వాతి నుంచి దివ్య భారతి తన అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉండటం మొదలెట్టారు. దీంతో పుకార్లు మరింత పెరిగాయి. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఓ కథనం ప్రకారం.. దివ్య భారతితో సాజిద్‌కు గొడవలు తీవ్రం అయ్యాయి. దివ్య చనిపోయిన రాత్రి ఆమె అపార్ట్‌మెంట్‌లో సాజిద్‌ ఉన్నాడు. ఆ రాత్రి ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. దీంతో అతడు ఆమెను బాల్కనీ లోంచి కిందకు తోసి చంపేశాడు. ఆ కేసు తన మీదుకు రాకుండా చూసుకున్నాడు.

దివ్య భారతి స్నేహితురాలు, ప్రముఖ ప్యాషన్‌ డిజైనర్‌ నీతా లుల్లా చెప్పిన కథనం ప్రకారం.. 1993 ఏప్రిల్‌ 5వ తేదీ చెన్నైలో ఓ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని దివ్య భారతి ముంబైకి వచ్చింది. రాత్రి నీతా లుల్లా తన భర్తతో కలిసి దివ్య భారతి ఉండే అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. ఆ ఇంట్లో అందరూ తాగుతూ ఉన్నారు. వీరందరికీ కోసం దివ్య ఇంటి పని మనిషి వంట గదిలో కొన్ని స్నాక్స్‌ చేస్తూ ఉంది. దివ్య లుల్లాతో మాట్లాడుతూ హాలులోంచి కిచెన్‌లోకి వెళ్లింది. గ్లాసులో వైట్‌ రమ్‌ పోసుకుని మళ్లీ హాలులోకి వచ్చింది.

టీవీ ఆన్‌ చేసి తన ఫేవరైట్‌ ఫ్లేస్‌ అయిన బాల్కనీలోకి వెళ్లింది. సేఫ్టీ వాల్‌ దగ్గర కూర్చుని మందు తాగటం ఆమెకు అలవాటు. ఆ అలవాటు ప్రకారమే అక్కడ కూర్చోబోయింది. పొరపాటున పట్టు తప్పి కిందపడింది. కిందపడ్డ కొద్ది సేపటికే ప్రాణాలు విడిచింది. అయితే, లుల్లా చెప్పిన దాంట్లో కూడా క్లారిటీ లేదు. ఆ తర్వాత దివ్య భారతి తల్లిదండ్రులు కూతురి మరణంపై  ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. తమ కూతురు డిప్రెషన్‌ కారణంగా ఆత్మహత్య చేసుకోలేదని, అలాగని ఆమెను ఎవ్వరూ హత్య చేయలేదని..

ఓ ప్రమాదం కారణంగా దివ్య చనిపోయిందని తెలిపారు. దివ్య భారతి చనిపోయి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు ఆమె మరణంపై ఎలాంటి క్లారిటీ లేదు. డిప్రెషన్‌ కారణంగా చనిపోయిందని కొందరు.. లేదు చంపేశారని మరికొందరు.. పొరపాటున జారి కిందపడి చనిపోయిందని ఇంకా కొందరు భావిస్తున్నారు. మరి, దివ్య భారతి డెత్‌ మిస్టరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.