iDreamPost
android-app
ios-app

ఒక్కసారిగా విడాకులు.. సమస్యలు చుట్టుముట్టాయి: సమంత

టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరుదైన వ్యాధి మయోసైటిస్ బారిన పడిన సామ్.. ప్రస్తుతం సినిమాలకు రెస్ట్ ఇచ్చి.. ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న ఆమె.. ఓ మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోటోలతో పాటు ఇంటర్వ్యూ ఇచ్చారు.

టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరుదైన వ్యాధి మయోసైటిస్ బారిన పడిన సామ్.. ప్రస్తుతం సినిమాలకు రెస్ట్ ఇచ్చి.. ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న ఆమె.. ఓ మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోటోలతో పాటు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఒక్కసారిగా విడాకులు.. సమస్యలు చుట్టుముట్టాయి: సమంత

తెలుగు టాప్ హీరోయినల్లో సమంత ఒకరు. ఏం మాయ చేశావే మూవీతో అందరి మనసుల్ని దోచేసిన ఈ చెన్నై భామ. ఫాస్ట్‌గా టాలీవుడ్‌లో పాగా వేసింది. వరుస హిట్లు ఆమెను స్టార్ నటిని చేశాయి. వచ్చిన తొలినాళ్లలోనే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి అగ్ర నటిగా పేరుగాంచింది. నటుడు నాగ చైతన్యను వివాహం చేసుకుని తెలుగింటి కోడలు అయ్యింది. పెళ్లైన తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ, హిట్స్ అందుకుంది. లేడీ ఓరియెంట్ మూవీస్ చేస్తూ.. మరో స్టెప్ వేస్తున్న సమయంలో విడిపోతున్నామంటూ చై సామ్ ప్రకటించే సరికి ఒక్కసారిగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఇప్పటి వరకు డివోర్స్ వెనుక కారణాలను ఇద్దరు వెల్లడించలేదు.

సినిమాలతో బిజీగా మారుతున్న సమయంలో మయో సైటిక్ బారిన పడింది సామ్. ఇక అప్పటి నుండి కొత్త సినిమాలు అంగీకరించలేదు. అప్పటికే సైన్ చేసిన పలు సినిమాలను పంటిబిగువునే నొప్పిని భరిస్తూ పూర్తి చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్య సంరక్షణలో భాగంగా పలు చికిత్సలు తీసుకుంటున్న చిల్ బులీ..ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో కీలక విషయాలను గురించి పేర్కొన్నారు. ఆ మ్యాగజైన్ పిక్స్, తన స్టిల్స్ పంచుకుంది సమంత. ఈ ఇంటారక్షన్‌లోనే ఒకే సమయంలో తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులు గురించి ప్రస్తావించారు. తన విడాకులు, సినిమాలు ఫ్లాపులు, ఆరోగ్య సమస్యలు అన్ని ఒకేసారి చుట్టిముట్టాయని, వాటితో సతమతమౌనట్లు పేర్కొన్నారు.

‘నా వైవాహిక బంధం ముగిసింది. ఆ సమయంలోనే నా ఆరోగ్యం దెబ్బతింది. నేను నటించిన పలు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో రెండేళ్ల పాటు బాధపడ్డాను. ఆ సమయంలోనే నటీనటుల గురించి చదివాను. వాళ్లెలా ఆరోగ్య సమస్యలను, వారిపై వస్తున్న ట్రోలింగ్స్ ను ఎదుర్కొని.. నిలబడ్డారో తెలుసుకున్నా. వారి గురించి తెలుసుకున్నప్పుడు నాకెంతో సాయపడింది. ఆందోళనకు గురైన వారి గురించిన వ్యక్తుల కథలు చదివాను. వారు సాధించినప్పుడు.. నేను చేయగలనన్నా ధైర్యం వచ్చింది. అదే నాకు బలాన్నిచ్చింది. ఒక నటిగా గుర్తింపు దక్కడం అరుదైన బహుమతి. అందుకే నటిగా నా బాధ్యతను నిర్వర్తించడంలో నిజాయితీ ఉంటాను.’ అని తెలిపారు.

‘నటీనటుల జీవితాలంటే సినిమా ఫలితాలు, అవార్డులు, వాళ్ల దుస్తులు మాత్రమే కాదూ. వాళ్లకు కూడా సుఖ, దుఖాలు ఉంటాయి. నా విషయాలన్నీ అందరికి తెలిసినందుకు బాధపడను. నేను ఎప్పటికీైనా వాటితో పోరాడాల్సిందేనని తెలుసు. ఇవన్నీ తెలియడం వల్ల బాధపడుతున్న వాళ్లు కూడా నాలాగే పోరాడే శక్తిని పొందాలని నేను ఆశిస్తున్నా’ అని సమంత అన్నారు. ప్రస్తుతం ఆమె భూటాన్ పర్యటనలో ఉన్నారు. ఇటవల విడుదలైన ఖుషీ యావరెేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి విదితమే. అలాగే హిందీలో వరుణ్ ధావన్ తో  కలిసి నటించిన సియాటెల్ వెబ్ సిరీస్ విడుదల కావాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Harper’s Bazaar, India (@bazaarindia)

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet