Saripodhaa Sanivaaram: నానితో మళ్లీ అదే రిస్క్ చేస్తున్న వివేక్ ఆత్రేయ! కానీ ఈసారి డిఫరెంట్..

'అంటే సుందరానికి' సినిమాకు తీసుకున్న రిస్క్ నే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, నాని సరిపోదా శనివారం మూవీకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ రిస్క్ ఏంటంటే?

'అంటే సుందరానికి' సినిమాకు తీసుకున్న రిస్క్ నే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, నాని సరిపోదా శనివారం మూవీకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ రిస్క్ ఏంటంటే?

‘సరిపోదా శనివారం’.. న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ ఆడియెన్స్ నుంచి డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు తీసుకున్న రిస్క్ నే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, నాని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఈసారి కాస్త డిఫరెంట్ గా వస్తుండటంతో అది రిస్క్ కాదన్నది కొందరి భావన. మరి ఆ రిస్క్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ పాన్ ఇండియా రేంజ్ తెరకెక్కింది. దాదాపు రూ. 100 కోట్లతో డీవివి దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ఇక డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తన జానర్ నుంచి బయటకు వచ్చిన తీసిన సినిమాగా సరిపోదా శనివారం నిలవబోతోందని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోయింది. ప్రేక్షకుల నుంచి ట్రైలర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, హీరో నాని గతంలో తీసుకున్న రిస్క్ నే తీసుకుంటున్నారు అని తెలుస్తోంది.

సరిపోదా శనివారం మూవీ రన్ టైమ్ సుమారు 174 నిమిషాల 50 సెకండ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు 3 గంటలు అన్నమాట. ఇంతటి సుదీర్ఘమైన రన్ టైమ్ ఒక్కోసారి సినిమాకు ప్లస్ అవ్వొచ్చు.. ఇంకోసారి మైనస్ అవ్వొచ్చు. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన అంటే సుందరానికి మూవీ కూడా ఇంతే నిడివి ఉంది. దాంతో ఆ సినిమా ల్యాగ్ అయ్యింది అన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకు కూడా 3 గంటల నిడివి ఉండటంతో.. మేకర్స్ రిస్క్ చేస్తున్నారా? అన్న టెన్షన్ లో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కానీ ఈ మూవీ పక్కా యాక్షన్ చిత్రంగా రాబోతోంది. వివేక్ ఆత్రేయ తన జానర్ నుంచి బయటకి వచ్చి తీసిన యాక్షన్ సినిమా ఇది. రెండు సినిమాలు డిఫరెంట్ జానర్స్ కావడంతో.. అప్పటిలా ఇబ్బంది ఈ మూవీకి కలగకపోవచ్చు. పైగా మేకర్స్ ఈ మూవీపై గట్టినమ్మకంతో ఉన్నారు. నాని కెరీర్ లో మరో వంద కోట్ల సినిమా చేరడం ఖాయమని వారు గట్టిగా చెబుతున్నారు.

Show comments