iDreamPost
android-app
ios-app

Multistarrer: ట్రెండ్ సెట్టింగ్ మల్టీస్టారర్.. ఒకే మూవీలో ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోలు!

  • Published Aug 01, 2024 | 3:33 PM Updated Updated Aug 01, 2024 | 3:33 PM

టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టింగ్ మల్టీస్టారర్ రాబోతోంది. ముగ్గురు హీరోలు కలిసి ఒకే మూవీలో కనిపించబోతున్నారు. మరి ఆ హీరోలు ఎవరు? ఇంతకీ ఆ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆ వివరాలు...

టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టింగ్ మల్టీస్టారర్ రాబోతోంది. ముగ్గురు హీరోలు కలిసి ఒకే మూవీలో కనిపించబోతున్నారు. మరి ఆ హీరోలు ఎవరు? ఇంతకీ ఆ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆ వివరాలు...

  • Published Aug 01, 2024 | 3:33 PMUpdated Aug 01, 2024 | 3:33 PM
Multistarrer: ట్రెండ్ సెట్టింగ్ మల్టీస్టారర్.. ఒకే మూవీలో ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోలు!

టాలీవుడ్ కు మల్టీస్టారర్ మూవీస్ కొత్తేం కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇక ఈ మధ్య కాలంలో ఆ ట్రెండ్ కాస్త స్పీడ్ అందుకుందనే చెప్పాలి. నా సామిరంగ, వాల్తేరు వీరయ్య, ఆర్ఆర్ఆర్ మూవీస్ తో పాటుగా మరికొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోలు స్క్రీన్ ను షేర్ చేసుకున్న విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. అయితే టాలీవుడ్ లో ఓ కొత్త రకం మల్టీస్టారర్ కు తెర లేపారు ముగ్గురు యంగ్ హీరోలు. ఒకే మూవీలో ముగ్గురు యంగ్ హీరోలు కలిసి నటించబోతున్నారు. మరి ఆ హీరోలు ఎవరు? ఈ సినిమా ఏది? దాని డైరెక్టర్ ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

విజయ్ కనకమేడల.. అల్లరి నరేష్ తో ‘నాంది’ మూవీ తెరకెక్కించి.. సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మరో పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. లెక్కప్రకారం ఈ మూవీ ఈ సంవత్సరమే పట్టాలెక్కాల్సింది. కానీ బెల్లంకొండ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కుదరలేదే. ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో మరో ఇద్దరు హీరోలు కూడా నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. అవును బెల్లంకొండతో పాటుగా నారా రోహిత్, మంచు మనోజ్ కూడా ఇందులో యాక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. దాంతో ఇది మినీ మల్టీస్టారర్ మూవీనే కాక.. టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతోంది.

కాగా.. మంచు మనోజ్ ఇందులో కూడా విలన్ పాత్రలోనే మెరవబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న ‘మిరాయ్’ మూవీలో మనోజ్ విలన్ గా కనిపించబోతున్నాడు. దీంతో పాటుగా మరో రెండు చిత్రాల్లో కూడా నెగటీవ్ రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో మూవీ చేరింది. కాగా.. నారా రోహిత్ త్వరలోనే సుందరకాండ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఒకే మూవీలో ముగ్గురు యంగ్ హీరోలు నటిస్తూ.. ట్రెండ్ సెట్టింగ్ మల్టీస్టారర్ మూవీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetlist girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş