iDreamPost
android-app
ios-app

Vakkantham Vamsi: బండ్ల గణేష్.. నాకు డబ్బులు ఎగ్గొట్టాడు.. ఆ పెద్ద మనిషి చెప్పడంతో: వక్కంతం వంశీ

  • Published Dec 10, 2023 | 12:28 PM Updated Updated Dec 10, 2023 | 12:28 PM

సినీ రచయిత నుంచి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ.. తన రెండో సినిమాను నితిన్ తో చేశాడు. 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బండ్ల గణేష్ తో తలెత్తిన వివాదాంపై స్పందించారు. ఆ వివరాలు..

సినీ రచయిత నుంచి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ.. తన రెండో సినిమాను నితిన్ తో చేశాడు. 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బండ్ల గణేష్ తో తలెత్తిన వివాదాంపై స్పందించారు. ఆ వివరాలు..

  • Published Dec 10, 2023 | 12:28 PMUpdated Dec 10, 2023 | 12:28 PM
Vakkantham Vamsi: బండ్ల గణేష్.. నాకు డబ్బులు ఎగ్గొట్టాడు.. ఆ పెద్ద మనిషి చెప్పడంతో: వక్కంతం వంశీ

వక్కంతం వంశీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. రచయితగా ఎన్నో సినిమాలకు కథలు కూడా అందించాడు. మరీ ముఖ్యంగా సురేందర్ రెడ్డి సినిమాలకు ఆయన ఎక్కువగా కథలు అందించేవాడు. రైటర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ.. మెగా ఫోన్ పట్టి.. అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడిగా మారారు. అయితే ఆ సినిమా అంత బాగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుని.. నితిన్ హీరోగా ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మేన్‌’ సినిమాతో మరోసారి దర్శకుడిగా ప్రేక్షకులను పలకరించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా వక్కంతం వంశీ ఓ యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బండ్ల గణేష్‌తో ఆయనకు ఉన్న ఆర్థిక లావాదేవిల వివాదంపై స్పందించారు.

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో 2015లో ‘టెంపర్‌’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. జూ ఎన్టీఆర్‌, కాజల్‌ జోడీగా నటించిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఈ మూవీకి కథను డైరెక్టర్‌ వక్కంతం వంశీ అందిస్తే.. బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. సినిమా సూపర్ హిట్ అయింది.. కానీ ఈ మూవీ ప్రొడ్యూసర్.. బండ్ల గణేష్ మాత్రం.. తనకు సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్‌ ఇవ్వలేదని వక్కంతం వంశీ అప్పట్లో కోర్టుకెక్కాడు. ఆ సమయంలో ఇది పెద్ద సంచలనంగా మారింది.

Bandla Ganesh not given money from me

తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా వంశీ ఈ వివాదంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “టెంపర్‌ సినిమా విడుదల సమయంలో బండ్ల గణేష్.. ఒక తేది వేసి చెక్కు ఇచ్చాడు. తర్వాత బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే అది కాస్త బౌన్స్‌ అయింది. అప్పటికే సినిమా కూడా విడుదల కావడంతో ఇక నేను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నేను ఎవర్ని కలవాలి..? ఏం చేయాలో కూడా అర్ధం కాలేదు. నాకు డబ్బు ఇవ్వకూడదనే అతనలా చేశాడని మాత్రం అర్థం అయింది. ఆ సమయంలో వాడికి (బండ్ల గణేష్‌) ఏ ఇబ్బంది ఉందో నాకు తెలియదు.. వాడిని కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదు” అని చెప్పుకొచ్చాడు.

Bandla Ganesh not given money from me

“డబ్బులు నాకు కూడా అవసరమే కదా. కానీ అవి వచ్చే అవకాశం లేదని అర్థం అయ్యింది. ఇక ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. దాంతో కోర్టుకు వెళ్లక తప్పలేదు. ఈ విషయంలో కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్దమనిషి వద్దకు వెళ్లి దీని గురించి చెప్పాను. ఆయన చెప్పడం వల్లనే వాడు డబ్బులు సెటిల్‌ చేశాడు. ఆ వివాదం సెటిల్ అయ్యింది. ఆ తర్వాత నుంచి మేం బాగానే ఉన్నాడు. వాడిపై నాకు కోపం ఏం లేదు. మోసం చేశాడనే బాధ ఉంది. కొన్ని రోజుల తర్వాత టెంపర్‌ హిందీ రైట్స్‌ అమ్మేందుకు వాడు, నేను ఇద్దరం ఒకే ఫైట్‌లో వెళ్లాం. ఇలా బండ్ల గణేష్‌ మాదిరి డబ్బు విషయంలో చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. కొందరు ఇప్పటికి కూడా ఇవ్వలేదు” అని చెప్పుకొచ్చారు.

వివాదంలో కోర్టు ఏమన్నదంటే..

బండ్ల గణేష్‌పై వక్కంతం వంశీ వేసిన కేసులో కోర్టు.. ఇరు పక్షాల వాదనలు విని.. తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15,86,550 రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను అప్పట్లో న్యాయస్థానం మంజూరు చేసింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి కూర్చోని ఈ డబ్బులు విషయాన్ని సెటిల్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.