iDreamPost
android-app
ios-app

డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ షాకింగ్‌ డెసిషన్‌.. కీడాకోలా చివరిదట..

  • Published Nov 02, 2023 | 11:51 AM Updated Updated Dec 14, 2023 | 6:03 PM

అలాంటి ఆయన ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. తరుణ్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘కీడాకోలా’ తర్వాత కామెడీ సినిమాలు చేయనని తేల్చి చెప్పారు.

అలాంటి ఆయన ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. తరుణ్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘కీడాకోలా’ తర్వాత కామెడీ సినిమాలు చేయనని తేల్చి చెప్పారు.

  • Published Nov 02, 2023 | 11:51 AMUpdated Dec 14, 2023 | 6:03 PM
డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ షాకింగ్‌ డెసిషన్‌.. కీడాకోలా చివరిదట..

షార్ట్‌ఫిల్మ్స్‌ టు బిగ్‌ ఫిల్మ్స్‌లోకి ఎంటర్‌ అయ్యారు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’తో నేషనల్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. దర్శకుడిగా తీసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దర్శకుడిగానే కాదు.. నటుడిగా కూడా తన సత్తా చాటుతున్నారు. తరుణ్‌ భాస్కర్‌ సినిమాల్లో కామెడీ ప్రధానంగా ఉంటుంది. సినిమా చూసే వారికి ఎక్కడా బోర్‌ కొట్టకుండా రెండున్నర గంటలు ఇట్టే గడిచిపోతాయి. తరుణ్‌ కామెడిలో తన మార్కును క్రియేట్‌ చేసుకున్నారు.

అలాంటి ఆయన ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. తరుణ్‌ నటించి, దర్శకత్వం వహించిన ‘కీడాకోలా’ తర్వాత కామెడీ సినిమాలు చేయనని తేల్చి చెప్పారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘‘ కీడాకోలా తర్వాత నేను ఇకపై కామెడీ సినిమాలు చేయను. మొత్తానికి జోనర్‌ మారదామని అనుకుంటున్నాను. అందుకే కీడాకోలాలో కామెడీలో పీక్స్‌ చూపించాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్‌ మీడియా వ్యాప్తంగా వైరల్‌గా మారింది. తరుణ్‌ సినిమాలను అభిమానించేవారు.. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని హాస్యాన్ని ఆస్వాధించే వారు బాధకు గురవుతున్నారు. ఈ నగరానికి ఏమైంది 2 కావాలంటూ కొంతమంది నెటిజన్లు సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

కాగా, ‘కీడా కోలా’ విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబర్‌ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. తరుణ్‌ భాస్కర్‌ తీరిక లేకుండా సినిమా ప్రమోషన్లలో గడుపుతున్నారు. తల్లి పుట్టిన రోజున ఆసల్యంగా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి, తరుణ్‌ భాస్కర్‌ ఇకపై కామెడీ సినిమాలు చేయనని చెప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş