iDreamPost
android-app
ios-app

బన్నీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. పుష్ప 2 క్లైమాక్స్ తో భయపెడుతున్న సుకుమార్!

  • Published Jun 11, 2024 | 12:46 PM Updated Updated Jun 11, 2024 | 12:46 PM

పుష్ప 2 క్లైమాక్స్ విషయంలో డైరెక్టర్ సుకుమార్ తీసుకున్న నిర్ణయం బన్నీ ఫ్యాన్స్ కు షాకిస్తోంది. ఇప్పటి వరకు ఏ మూవీకి తీసుకోని డెసిషన్ సుక్కు పుష్ప 2 కోసం తీసుకున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 క్లైమాక్స్ విషయంలో డైరెక్టర్ సుకుమార్ తీసుకున్న నిర్ణయం బన్నీ ఫ్యాన్స్ కు షాకిస్తోంది. ఇప్పటి వరకు ఏ మూవీకి తీసుకోని డెసిషన్ సుక్కు పుష్ప 2 కోసం తీసుకున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jun 11, 2024 | 12:46 PMUpdated Jun 11, 2024 | 12:46 PM
బన్నీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. పుష్ప 2 క్లైమాక్స్ తో భయపెడుతున్న సుకుమార్!

సినిమాలు తెరకెక్కించడంలో ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. అలా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు స్టార్ డైరెక్టర్ సుకుమార్. రామ్ తో జగడం నుంచి మెుదలు పెడితే.. నిన్నటి పుష్ప వరకు ఒక్కో సినిమాను ఒక్కోతీరుగా చెక్కుకుంటూ వచ్చాడు డైరెక్టర్ సుక్కు. ఇక మహేశ్ బాబుతో తీసిన ‘నెం.1 నేనొక్కడినే’ హాలీవుడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2తో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి వస్తున్నాడు. అయితే పుష్ప 2 క్లైమాక్స్ విషయంలో సుక్కు తీసుకున్న షాకింగ్ డెసిషన్ బన్నీ ఫ్యాన్స్ ను ఆందోళనపరుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 షూటింగ్ విషయంలో ఏ చిన్న వర్క్ లో కూడా కాంప్రమైజ్ కావట్లేదు డైరెక్టర్ సుకుమార్. బొమ్మను చెక్కినట్లు ఈ చిత్రాన్ని చెక్కుతున్నాడు. అయితే పుష్ప 2  క్లైమాక్స్ షూటింగ్ విషయంలో సుకుమార్ ఓ నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు ఆ డెసిషన్ బన్నీ ఫ్యాన్స్ ను ఆందోళనపరుస్తోంది. ఇంతకీ సుక్కు తీసుకున్న నిర్ణయం ఏంటంటే? సాధారణంగా సుకుమార్ తన సినిమాలకు రెండు క్లైమాక్స్ లు రాసుకుంటాడు. అందులో ఏది బెటర్ గా అనిపిస్తే.. దాన్ని ఫాలో అయిపోతాడు. కానీ తొలిసారి పుష్ప 2 కోసం ఏకంగా మూడు క్లైమాక్స్ లు సిద్ధం చేశాడట. తొలి రెండిటి కంటే బెటర్ గా మూడో ఐడియా రావడంతో.. దాన్ని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడట.

Pushpa

ఇక ఇదే విషయాన్ని మూవీ యూనిట్ కు చెప్పి.. డేట్స్ రెడీ చేయాల్సిందిగా కోరాడట. దాంతో ఇప్పటికే తెరకెక్కించిన క్లైమాక్స్ పక్కనపెట్టి.. మూడో ఐడియాను షూట్ చేసేందుకు సిద్దమైయ్యారని టాక్. బెటర్ మెంట్ కోసం సుక్కు ఎంతవరకైనా వెళ్తాడు అనే పేరు ఇండస్ట్రీలో ఉండనే ఉంది. ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఆగస్టు 15న థియేటర్లకు వస్తుందని ఎంతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ న్యూస్ షాకే. రిలీజ్ డేట్ దగ్గరపడటం.. క్లైమాక్స్ ను రీ షూట్ చేస్తుండటంతో కరెక్ట్ టైమ్ కు మూవీ రిలీజ్ అవుతుందా? కాదా? అన్న అనుమానం ఫ్యాన్స్ లో ఉంది. కానీ సుక్కు మాత్రం తన పనిని తాను చేసుకుంటూ ముందుకువెళ్తున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbabilbet girişgrandpashabet