iDreamPost
android-app
ios-app

డైరెక్టర్ శంకర్ కుమార్తెకు రెండో వివాహం.. వరుడు ఎవరంటే?

  • Published Apr 15, 2024 | 5:34 PM Updated Updated Apr 15, 2024 | 5:34 PM

Director Shankar Daughter Marriage: డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యారేజ్ కి పాన్ ఇండియా లెవల్లో ఉన్న సెలబ్రిటీలు హాజరయ్యారు.

Director Shankar Daughter Marriage: డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యారేజ్ కి పాన్ ఇండియా లెవల్లో ఉన్న సెలబ్రిటీలు హాజరయ్యారు.

  • Published Apr 15, 2024 | 5:34 PMUpdated Apr 15, 2024 | 5:34 PM
డైరెక్టర్ శంకర్ కుమార్తెకు రెండో వివాహం.. వరుడు ఎవరంటే?

స్టార్ డైరెక్టర్ శంకర్ కు పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన ఈ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. సోమవారం చెన్నై వేదికగా.. స్టార్ డైరెక్టర్స్, సూపర్ స్టార్స్, స్టార్ హీరోయిన్స్, అతిరథ మహారథుల సమక్షంలో శంకర్ కుమార్తె వివాహం కన్నుల పండువగా జరిగింది. వివాహానికి హాజరైన అతిథులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇది ఐశ్వర్య శంకర్ కు రెండో వివాహం అని అందరికీ తెలిసిందే.

డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యకు ఫిబ్రవరిలో తరుణ్ అనే కుర్రాడితో నిశ్చితార్థం జరిగింది. అతను ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. తాజాగా చెన్నైలో ఐశ్వర్య- తరుణ్ ల వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి మణిరత్నం, రజినీ కాంత్, కమల్ హాసన్, చియాన్ విక్రమ్, హీరో సూర్య, కార్తీ, నయనతార, విఘ్నేశ్ శివన్ సహా పలువురు సెలబ్రిటీలు హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె ఐశ్వర్య విహాహ ఫొటోలే వైరల్ అవుతున్నాయి. చిన్న కుమార్తె అదితి కూడా అక్కతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. సెలబ్రిటీలు మాత్రమే కాకుండా.. నెటిజన్స్ కూడా ఈ కపుల్ కి తమ విషెస్ చెప్తున్నారు.

Shankar daughter marriage

డైరెక్టర్ శంకర్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐశ్వర్య, అదితి అనే ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు కూడా ఉన్నాడు. ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. 2021లో క్రికెటర్ దామోదరన్ రోహిత్ ను వివాహం చేసుకుంది. కానీ, వాళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు. దామోదరన్ రోహిత్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఒక 16 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో దామోదరన్ రోహిత్ పేరు కూడా ఉంది. మొత్తం ఐదుగురిపై పోక్సో కేసు నమోదు కాగా.. అందులో రోహిత్ కూడా ఒకరు. ఫిర్యాదులో ఆ అమ్మాయి క్రికెట్ నేర్చుకోవడానికి వెళ్లిన సమయంలో తనపై లైంగికంగా దాడి జిరిగినట్లు వెల్లడించింది. స్టేట్ కెప్టెన్ కి ఈ విషయం చెప్తే కోచ్ పై చర్యలు తీసుకోవడానికి అతను నిరాకరించాడంటూ వాపోయింది.


ఇంక డైరెక్టర్ శంకర్ సినిమాల విషయానికి వస్తే.. కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ చిత్రం దాదాపుగా పూర్తయ్యింది. త్వరలోనే అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇంక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- కియా అద్వాణీ కాంబోలో గేమ్ ఛేంజర్ సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు డైరెక్టర్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ దాదాపుగా దీపావళికి వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet