iDreamPost
android-app
ios-app

యానిమల్ మూవీపై RGV రివ్యూ.. సందీప్ నీ కాళ్ల ఫొటో పెడితే మెక్కుకుంటా!

  • Published Dec 03, 2023 | 9:38 PM Updated Updated Dec 03, 2023 | 9:38 PM

Director RGV Review On Animal Movie: యానిమల్ సినిమాకి ఇప్పటికే సూపర్ హిట్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రెండ్రోజుల్లో రూ.236 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాపై డైరెక్టర్ ఆర్జీవీ రివ్యూ ఇచ్చారు.

Director RGV Review On Animal Movie: యానిమల్ సినిమాకి ఇప్పటికే సూపర్ హిట్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రెండ్రోజుల్లో రూ.236 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాపై డైరెక్టర్ ఆర్జీవీ రివ్యూ ఇచ్చారు.

  • Published Dec 03, 2023 | 9:38 PMUpdated Dec 03, 2023 | 9:38 PM
యానిమల్ మూవీపై RGV రివ్యూ.. సందీప్ నీ కాళ్ల ఫొటో పెడితే మెక్కుకుంటా!

యానిమల్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రణ్ బీర్ కపూర్- సందీప్ రెడ్డి వంగా కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ చిత్రం అంటూ ప్రంశసలు కురిపిస్తున్నారు. ఒక తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లో ఒక అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించాడు అంటూ పొగిడేస్తున్నారు. కబీర్ సింగ్ తో బీ టౌన్ ని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ టాక్ వచ్చింది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇంక బాక్సాఫీస్ గురించి అయితే చెప్పక్కర్లేదు. రెండ్రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.236 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ లో రివ్యూ ఇచ్చారు.

రామ్ గోపార్ వర్మ ఇలా రాసుకొచ్చాడు.. “యానిమల్ సినిమా మీద రాసిన చాలా  రివ్యూలు చూసి, చదివిన తర్వాతే నేను సినిమాకి వెళ్ళాను.. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా సినిమాలు తీసిన తర్వాత నేను కేవలం ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఏ సినిమానీ చూడలేను.. అందుకే ఈ సినిమాని వేరు వేరు కోణాల్లోచూడాలని డిసైడ్ అయ్యి వెళ్ళాను. నైన్ అండ్ హాఫ్ వీక్స్, ఫ్యాటల్ అట్రాక్షన్, లోలిట, లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్ యాడ్రియన్ లిన్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, సినిమా అన్నది ప్రేక్షకుడికి నచ్చిందా, నచ్చలేదా, అన్నంత సింపుల్ గా ఉండకూడదు. రియల్లీ ఇంపాక్ట్ ఫుల్ సినిమా అనేది ప్రేక్షకులు తీవ్రంగా డిస్కస్ చేసుకుని ఆర్గ్యూ చేసుకునేలా ఉండాలి. ఒక కొత్త తర్కానికి తెర తీయాలి అన్నాడు. అదే సందేశం ఇవ్వాళ సందీప్ వంగా, యానిమాల్ చిత్రంతో వీపు పగిలిపోయేలా కొట్టి నిరూపించాడు” అంటూ చెప్పాడు. అక్కడితో ఆగకుండా ఇంకో ఎన్నో అద్భుతమైన ఉపమాన, ఉపమేయ, ఉదాహరణలతో ఆర్జీవీ ఈ రివ్యూని రాసుకొచ్చాడు.

సందీప్ వంగా ఒక అద్భుతమైన సినిమా తీశాడనే విషయాన్ని ఇప్పటికే ప్రేక్షకులు కూడా ఒప్పేసుకున్నారు. కానీ, కొందరు మాత్రం పని కట్టుకుని నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అది వాళ్ల అభిప్రాయం కూడా కావచ్చు. అలాంటి వారికి ఆర్జీవీ రివ్యూ ఒక కనివిప్పు అవుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా సినిమా గురించి మాట్లాడుతూ.. “హేయ్ సందీప్ వంగా దయచేసి నీ కాళ్ల ఫొటో నాకు వాట్సాప్ లో పంపిస్తే మొక్కుకుంటాను. అందుకు కారణాలు ఏంటంటే.. 1. కెమెరా కనుక్కున్న మొదలు ఇప్పటివరకూ అందరూ నమ్ముతున్న సినీ  సంప్రదాయాలన్నింటిని నీ ఎడమ కాలి బూటుతో తన్ని తన్ని రక్తాలు కక్కుకునేలా చేశావు.

2. ఇక నుంచి బాలీవుడ్ లో గానీ, టాలీవుడ్  లో గానీ, ప్రతి సినిమా ఆఫీస్లోనూ నీ యానిమల్ సినిమా టాపిక్ ఒక దెయ్యంలా ఆవహించి వాళ్ళు ముందు ముందు తియ్యబోయే ప్రతి సినిమాని పీడిస్తుంది. నేను ముందే చెప్పినట్టు, ఆ అమ్మాయిని షూ నాకమని నువ్వు రణ్ బీర్ తో చెప్పించిన ఆ ఒక్క షాట్ నాకు నచ్చకపోయినా.., అనిల్ లాస్ట్ డైలాగ్ నుంచి జంప్ కట్ తీసుకుని ఎండ్ టైటిల్స్ కి వెళ్లినప్పుడు కెమెరా జూమ్ అవుట్ షాట్ లో శక్తి కపూర్ ఒళ్లో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న రణ్ బీర్ షాట్ ఒక్కదాని కోసం, నేను మీ ఇద్దరి షూస్ నాకుతాను” అంటూ రామ్ గోపాల్ వర్మ తనదైనశైలిలో యానిమల్ మూవీకి రివ్యూ ఇచ్చాడు. ఆర్జీవీ పూర్తి రివ్యూని ఈ కిందనే ఉన్న ఆయన పోస్ట్ లో చదవుకోండి. మరి.. ఆర్జీవీ ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet