iDreamPost
android-app
ios-app

హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ కూతురు! ఆమె ఎవరంటే?

  • Author Soma Sekhar Published - 03:49 PM, Thu - 3 August 23
  • Author Soma Sekhar Published - 03:49 PM, Thu - 3 August 23
హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ కూతురు! ఆమె ఎవరంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోల వారసులు, హీరోయిన్ ల వారసులు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఎంతో మంది వారసులు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోలు, హీరోయిన్ లుగా వెలుగొందుతున్నారు. తాజాగా మరో వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఆమె హీరో కూతురో, హీరోయిన్ కూతురో కాదు. ఓ ప్రముఖ డైరెక్టర్ కూతురు. మరి ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఆ డైరెక్టర్ కూతురు ఎవరో ఇప్పుడు చూద్దాం.

రాజీవ్ మీనన్.. ప్రముఖ కెమెరా మెన్ గా, డైరెక్టర్ గా అందరికి సుపరిచితమే. ఇప్పుడు నటుడిగానూ అవతారమెత్తాడు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో వచ్చిన ‘విడుదలై’ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు రాజీవ్ మీనన్. తాజాగా వెపన్ అనే సినిమాలో విలన్ గా నటించాడు. ఇక త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజీవ్ మీనన్ కూతురు సరస్వతి హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కాబోతుంది. వివరాల్లోకి వెళితే.. మూమెంట్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై జీఏ హరికృష్ణన్ నిర్మిస్తున్న ఓ సినిమాలో సరస్వతి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో కథానాయిక కూడా ఉందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ మూవీకి ఇంకా పేరును ఖరారు చేయలేదు. ఇక ఈ మూవీకి రంగనాథన్ దర్శకత్వం వహిస్తుండగా.. దర్శకుడు సెల్వరాఘవన్, సునీల్, యోగిబాబు, రాధారవి, షైన్ టామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఇదికూడా చదవండి: ప్రభాస్ హీరోయిన్ కి ఫ్యాన్ బాయ్ వెరైటీ ప్రపోజల్! వీడియో వైరల్!

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap