iDreamPost
android-app
ios-app

ప్రభాస్ హీరోయిన్ కి ఫ్యాన్ బాయ్ వెరైటీ ప్రపోజల్! వీడియో వైరల్!

  • Author ajaykrishna Published - 12:52 PM, Thu - 3 August 23
  • Author ajaykrishna Published - 12:52 PM, Thu - 3 August 23
ప్రభాస్ హీరోయిన్ కి ఫ్యాన్ బాయ్ వెరైటీ ప్రపోజల్! వీడియో వైరల్!

ఎవరికైనా అభిమాన సినీతారలు ఎదురుపడితే ఏం చేస్తారు? మామూలుగా అయితే వెంటనే దగ్గరికి వెళ్లి.. హాయ్ చెప్పి, సెల్ఫీ దిగే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు ఫేవరేట్ సెలబ్రిటీ కదా.. వెంటనే లవ్ ప్రపోజ్ కూడా చేస్తుంటారు. ఇవన్నీ కామన్ గా జరిగేవి. కానీ.. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ కనిపించగానే ఓ అభిమాని ఏం చేసాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్టార్ హీరోయిన్ గా శ్రద్ధా తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమే. డార్లింగ్ ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ సాహో చేసింది. ఆ సినిమాతో తెలుగు.. అలాగే సౌత్ ఆడియన్స్ అందరికీ పరిచయమైంది. శ్రద్ధా ముందునుండి ఓ బాలీవుడ్ హీరోయిన్ గా దాదాపు తెలుసు. కానీ.. సౌత్ లో సినిమా చేయడం.. అందులోనూ తెలుగు సినిమా చేయడం విశేషం.

ఇక సాహో మూవీ ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. మూవీలో ప్రభాస్, శ్రద్ధా కెమిస్ట్రీకి, వాళ్ల పెయిర్ కి మంచి మార్కులు పడ్డాయి. సాహో నుండే శ్రద్ధాకి తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే.. ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు శ్రద్ధా. అదే చాలా రోజులుగా తెలుగు ఫ్యాన్స్ లో కనిపిస్తున్న లోటు. మరి త్వరలో ఏదైనా తెలుగు ప్రాజెక్ట్ ఓకే చేస్తుందో లేదో తెలియదు. కానీ.. ప్రెజెంట్ తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టిందని అర్ధమవుతుంది. శ్రద్ధా ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలే ఎక్కువగా చేసింది. అలాగని నటిగా తనను తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకుంది. అయితే.. ఇదివరకటిలా వెంటవెంటనే సినిమాలు చేయకుండా స్పీడ్ కాస్త స్లో చేసింది.

ఇదిలా ఉండగా.. తాజాగా శ్రద్ధాకి ఎయిర్ పోర్ట్ లో ఓ అభిమానితో క్రేజీ ఇన్సిడెంట్ ఎదురైంది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల శ్రద్ధా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించగా.. ఓ అభిమాని సంతోషం పట్టలేక క్రేజీ పని చేశాడు. ఎంతగానో అభిమానించే హీరోయిన్ ఎదురుగా నిలిచేసరికి.. తన అభిమానాన్ని మాటల్లో చెప్పలేక చేతల్లో చేసి చూపించాడు. శ్రద్ధాని చూసి వెంటనే దగ్గరికి వచ్చిన అభిమాని.. మోకాళ్ళపై నిల్చొని ఫ్లవర్స్ బొకే ఇచ్చి.. ప్రపోజ్ చేశాడు. దీంతో ఫ్యాన్ ప్రేమకు ఫిదా అయిన శ్రద్ధా.. షేక్ హ్యాండ్ ఇచ్చి అతనితో ఫోటోలు దిగింది. ఈ సన్నివేశం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫేవరేట్ హీరోయిన్ ఎదురైతే ఎవరి ఆనందమైనా అంతే అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. శ్రద్ధా కెరీర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది రణబీర్ తో ‘తూ ఝాటి మై మక్కర్’ సినిమా చేసింది. ప్రస్తుతం స్త్రీ 2లో నటిస్తోంది. మరి శ్రద్ధా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet