iDreamPost
android-app
ios-app

Prashanth Varma: ‘హనుమాన్’ రెమ్యూనరేషన్ విషయంలో గొడవ? ప్రశాంత్ వర్మ క్లారిటీ!

  • Published Feb 08, 2024 | 5:00 PM Updated Updated Feb 08, 2024 | 5:00 PM

డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి మధ్య పారితోషికం విషయంలో గొడవలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ సాబ్.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి మధ్య పారితోషికం విషయంలో గొడవలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ సాబ్.

  • Published Feb 08, 2024 | 5:00 PMUpdated Feb 08, 2024 | 5:00 PM
Prashanth Varma: ‘హనుమాన్’ రెమ్యూనరేషన్ విషయంలో గొడవ? ప్రశాంత్ వర్మ క్లారిటీ!

ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి బరిలో నిలిచి.. అఖండ విజయాన్ని సాధించింది హనుమాన్ మూవీ. టాలెంటెడ్ యువ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లను కొల్లగొట్టింది. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం మూవీ ఢీ కొట్టి మరి విజయకేతనం ఎగురవేసింది. ఇక ఈ మూవీకి ఈ రేంజ్ కలెక్షన్లు వస్తాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే? డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి మధ్య రెమ్యూనరేషన్ విషయంలో గొడవలు జరుగుతున్నాయట. ఇక ఈ వార్తలపై డైరెక్ట్ గా ప్రశాంత్ వర్మనే క్లారిటీ ఇచ్చాడు.

హనుమాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సిస్ లో అయితే గుంటూరు కారం మూవీ వసూళ్ల కంటే డబుల్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ఈ సినిమా రెమ్యూనరేషన్ విషయంలో డైరెక్టర్ ప్రశాత్ వర్మ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఇక ఆ న్యూస్ పై తాజాగా స్పందించాడు ప్రశాంత్ వర్మ. ‘వ్యతిరేకతను తీసేస్తూ.. నవ్వుకుంటున్నాం. హనుమాన్ స్పిరిట్ తో ముందుకు సాగుతాం’ అంటూ ట్విట్టర్ వేదిగా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డితో నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేశాడు ప్రశాంత్ వర్మ. దీంతో తామిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పకనే చెప్పాడు. దీంతో ఈ రూమర్లకు చెక్ పడినట్లు అయ్యింది.

కాగా.. హనుమాన్ మూవీకి సంబంధించిన రెమ్యూనరేషన్స్ గురించి సోషల్ మీడియలో విపరీతంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. హీరో తేజ సజ్జ ఈ సినిమా కోసం చాలా మూవీలను రిజెక్ట్ చేశాడని. రెండు, మూడు సంవత్సరాలు హనుమాన్ కోసమే కేటాయించాడని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సైతం తేజతోనే కలిసి ఈ ప్రాజెక్ట్ మీదే ప్రాణం పెట్టాడని, దీంతో వీరిద్దరు భారీ స్థాయిలోనే పారితోషికం తీసుకున్నారని ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు.

ఇదికూడా చదవండి: OTTలోకి వచ్చేసిన హర్రర్ హిట్.. ఒంటరిగా చూసే ధైర్యముందా?

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetlist girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş