iDreamPost
android-app
ios-app

Adipurush: ఆ కారణం చేతనే ప్రభాస్ ను రాముడిగా ఎంపిక చేసుకున్నా: ఓం రౌత్

  • Author Soma Sekhar Published - 06:29 PM, Mon - 19 June 23
  • Author Soma Sekhar Published - 06:29 PM, Mon - 19 June 23
Adipurush: ఆ కారణం చేతనే ప్రభాస్ ను రాముడిగా ఎంపిక చేసుకున్నా: ఓం రౌత్

సాధారణంగా కొంతమంది రచయితలు కథలు రాసేటప్పుడు ఒక హీరోను ఊహించుకుని రాస్తారు. ఈ పాత్రకు ఈ హీరోనే న్యాయం చేయగలడని వారి ఉద్దేశం. వారు పాత్రను తీర్చిదిద్దే క్రమంలోనే ఆ హీరోను ఆ పాత్రలో ఊహించుకుంటారు కాబట్టి వారికి తెలుస్తుంది. అయితే కొన్ని సార్లు కథలు నచ్చక ఓ హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చేస్తుంటాడు. అయితే ఆ పాత్రను అదే హీరో చేయడానికి కొంత మంది దర్శకులు ఆరాపడుతుంటారు. తాజాగా రాముడి పాత్రకు రాముడినే ఎంపిక చేసుకోవడానికి గల కారణాలను ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ వెల్లడించారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ టాప్ హీరోగా, పాన్ ఇండియా హీరోగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆదిపురుష్ సినిమాతో బాక్సాఫీస్ వసూళ్ల సునామీని సృష్టిస్తున్నారు. కేవలం మూడు రోజుల్లో రూ. 340 కోట్లు కొల్లగొట్టాడు డార్లింగ్. ఇక ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపిస్తున్నారు అనగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రాముడిగా ప్రభాస్ నే ఎంపిక చేసుకోవడానికి గల కారణాలను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు డైరెక్టర్ ఓం రౌత్.

ఆయన మాట్లాడుతూ..”రామాయాణం మెుత్తాన్ని తెరపై చూపించడం సాధ్యం కాదు. అందుకే యుద్దకాండ వరకే తీసుకున్నా. ఈ ఆదిపురుష్ కొత్త తరం కోసం తీసిన సినిమా. నేను ఈ స్టోరీ అనుకున్నప్పుడే ప్రభాస్ కచ్చితంగా ఈ పాత్రకు సరిపోతాడని అనుకున్నా. మన మనసులో భావాలు కళ్లలో కనిపిస్తాయని నా అభిప్రాయం. ప్రభాస్ కళ్లలో నీతి, నిజయాతీ కనిపిస్తుంటాయి. అందుకే రాముడి పాత్ర కోసం ప్రభాస్ ను ఎంపిక చేసుకున్నా. మెుదట ఈ కథను చెప్పి, రాముడు నువ్వే అనగానే షాక్ కు గురైయ్యాడు. ఇక ప్రభాస్ ను ఈ సినిమాకు ఒప్పించడం చాలా కష్టం అయ్యింది” అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ సినిమాలో అన్ని విధాల నాకు సహకరించారని ఓం రౌత్ తెలిపారు. భవిష్యత్ లోనూ మా ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగుతుందని ఓం రౌత్ అన్నారు.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş