iDreamPost
android-app
ios-app

కల్కీ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ ఆరోపణలు.. ఇచ్చి పడేసిన నాగ్ అశ్విన్

Nag Ashwin- Kalki 2898 AD: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అంతా ఎదురు చూస్తున్న చిత్రం కల్కీ 2898 ఏడీ. ఈ మూవీపై తాజాగా మరోసారి కాపీ ఆరోపణలు వచ్చాయి. అయితే ఈసారి డైరెక్టర్ నాగ్ అశ్విన్ గట్టిగా ఇచ్చి పడేశాడు.

Nag Ashwin- Kalki 2898 AD: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అంతా ఎదురు చూస్తున్న చిత్రం కల్కీ 2898 ఏడీ. ఈ మూవీపై తాజాగా మరోసారి కాపీ ఆరోపణలు వచ్చాయి. అయితే ఈసారి డైరెక్టర్ నాగ్ అశ్విన్ గట్టిగా ఇచ్చి పడేశాడు.

కల్కీ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ ఆరోపణలు.. ఇచ్చి పడేసిన నాగ్ అశ్విన్

టాలీవుడ్ గురించి ప్రస్తుతం సినిమా ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనే పరిస్థితికి వచ్చేశాం. ప్రతి డైరెక్టర్ పాన్ వరల్డ్ కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. ఆ లిస్టులో ఉన్న నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీతో మొత్తం ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే కల్కీ సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రమోషన్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. జూన్ 27న కల్కీ 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఇటీవల ఈ మూవీపై కాపీ ఆరోపణలు వచ్చాయి. వాటికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అదిరిపోయే కౌంటర్ కూడా ఇచ్చాడు.

కల్కీ సినిమాపై పాన్ వరల్డ్ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, టీజర్, అశ్వత్థామ టీజర్ అన్నీ సినిమా అంచనాలను ఒక్కో మెట్టు పెంచుకుంటూ పోయాయి. ఇప్పటికే ఈ మూవీలో పెద్ద తారాగణమే ఉంది. ఒక పెద్ద కథ ఉంది, స్టార్స్ ఉన్నారు, పురాణాలు, ఇతిహాసాలు అంటూ చాలా పెద్ద విషయం ఉంది. ఇలాంటి మూవీపై కాపీ ఆరోపణలు రావడం కొత్తేం కాదు. గతంలో కూడా కల్కి సినిమా హాలీవుడ్ చిత్రాలకు కాపీ అంటా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా మరోసారి అలాంటి కాపీ ఆరోపణలు వచ్చాయి. ఇటీవల వచ్చిన డ్యూన్ అనే సినిమాకి కల్కీ 2898 ఏడీ మూవీ కాపీ అంటూ పుకార్లు పుట్టించారు. అదే విషయం డైరెక్టర్ నాగ్ అశ్విన్ దాకా వచ్చింది. ఇటీవలే గోయెర్స్ ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ నాగ్ అశ్వన్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. మీ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రం ‘డ్యూన్’ మూవీతో పోలుస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ నాగ్ అశ్విన్ ని అడిగేశారు.

సమాధానం చెప్పేముందుకు నాగ్ అశ్విన్ కాస్త షాకైనట్లు చేసి.. “అవునా.. బహుశా మీరు కల్కీ సినిమాలో ఉన్న ఇసుకను చూసి అలా అనుకుని ఉండచ్చు. ఇసుక ఉన్న ఏ సినిమాని చూసినా డ్యూన్ అనే మూవీలాగానే కనిపిస్తుంది” అంటూ నాగ్ అశ్విన్ గట్టిగా ఇచ్చి పడేశాడు. ఒక్క దెబ్బతో కల్కీ సినిమా ఏ మూవీకి కాపీ కాదని.. ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాలకు అస్సలు కాపీ కాదు అనే విషయాన్ని నాగ్ అశ్విన్ మరోసారి స్పష్టం చేశాడు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయి? ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? పాటలు ఎప్పుడు వస్తాయి? ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి.. కల్కీ 2898 ఏడీ మూవీ కాపీ అంటూ వస్తున్న ఆరోపణలకు నాగ్ అశ్విన్ ఇచ్చిన కౌంటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş