iDreamPost
android-app
ios-app

హాలీవుడ్‌ సూపర్‌ హీరోలపై నాగ్ అశ్విన్ కామెంట్లు!

  • Published Jul 21, 2023 | 3:32 PM Updated Updated Jul 21, 2023 | 3:32 PM
  • Published Jul 21, 2023 | 3:32 PMUpdated Jul 21, 2023 | 3:32 PM
హాలీవుడ్‌ సూపర్‌ హీరోలపై నాగ్ అశ్విన్ కామెంట్లు!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమా పేరు రివీలైంది. గురువారం విడుదలైన గ్లింప్స్‌లో.. ప్రాజెక్ట్‌ కే అంటే ‘‘ కల్కి 2898 ఏడీ’’గా దర్శకుడు నాగ్‌ స్పష్టత ఇచ్చారు. గురువారం అమెరికాలోని చికాగాలో జరిగిన కామిక్‌ కాన్‌ ఈవెంట్‌లో చిత్ర బృందం పాల్గొంది. ఈ కార్యక్రమంలోనే కల్కి గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్‌ అశ్వీన్‌ హాలీవుడ్‌ మీడియాతో ముఖాముఖీ నిర్వహించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘ ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాల ప్రిపరేషన్‌ పట్టింది. సినిమా తియ్యడానికి మరో రెండు సంవత్సరాలు పడుతోంది. కల్కి సాధారణమైన సినిమా కాదు. భిన్నమైన సినిమా. భారతీయ పురాణాలు, సంప్రదాయాల గురించి తెలియచేస్తుంది. ఒక తెలుగు అబ్బాయిగా, ఒక భారతీయుడిగా.. ఒక స్టార్ వార్స్ ఫ్యాన్‌గా నాకు నచ్చినవన్నీ ఇందులో ఉంటాయి. మీకు గాలిలో ఎగిరే సూపర్‌ మ్యాన్‌ ఉంటే.. మాకు అంతరిక్షంలోకి కూడా వెళ్లే హనుమాన్ ఉన్నాడు. ఆయన సూర్యుడ్ని కూడా తింటాడు.

భవనాలను కూలగొట్టే హల్క్ మీకు ఉంటే.. మాకు కొండలను కూడా పిండి చేసే హనుమాన్ ఉన్నాడు. ఇండియాని ఈ ప్రపంచానికి చూపించడానికి చాలా ఉత్సాహంతో ఉన్నా’’ అని అన్నారు. ఇక, నాగ్ అశ్విన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ‘‘ కల్కి 2898 ఏడీ’’ దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌తో పాటు పలువురు ప్రముఖ నటుటు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి, హాలీవుడ్‌ సూపర్‌ హీరోస్‌పై నాగ్‌ అశ్విన్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş