iDreamPost
android-app
ios-app

ప్రభాస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా.. స్టార్ డైరెక్టర్ కూతురు

  • Published Jul 24, 2024 | 12:09 PM Updated Updated Jul 24, 2024 | 12:09 PM

ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కిడ్స్ ఎంట్రీ ఇవ్వడ కొత్తేమీ కాదు. దశాబ్ధ కాలంగా సెలబ్రిటీ కిడ్స్ వెండితెరపై ఎంట్రీ ఇస్తూ తమకు నచ్చిన ప్రొఫెషన్ లో వర్క్ చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూతురు ప్రభాస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కిడ్స్ ఎంట్రీ ఇవ్వడ కొత్తేమీ కాదు. దశాబ్ధ కాలంగా సెలబ్రిటీ కిడ్స్ వెండితెరపై ఎంట్రీ ఇస్తూ తమకు నచ్చిన ప్రొఫెషన్ లో వర్క్ చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూతురు ప్రభాస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Jul 24, 2024 | 12:09 PMUpdated Jul 24, 2024 | 12:09 PM
ప్రభాస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా.. స్టార్ డైరెక్టర్ కూతురు

వెండితెరపై అలరించే సెలబ్రిటీస్ పిల్లలు వారసత్వంగా ఇండస్ట్రీకి పరిచయమవ్వడం కొత్తేమీ కాదు. ఎందుకంటే.. ఇప్పటికే స్టార్ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కిడ్స్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తమ సత్తాను చూపిస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది యాక్టర్స్ గా మరి కొందరు దర్శక, నిర్మాతలు గా.. సింగర్స్ , మ్యూజిషియన్ గా ఇలా రకరకాల ప్రొఫెషన్స్ లో తమ టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం వెండితెరపై అడుగులు వేస్తున్నారు. మరీ, అలాంటి వారిలో టాలీవుడ్ సక్సేస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కూతురు కూడా ఒకరు. ఇక డైరెక్టర్ మారుతికి ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. యూత్ ను ఆకట్టుకునే కథలతో సినిమాలు చేస్తూ మారుతి ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన కూతురి పేరు సోషల్ మీడియాలో తెగ మారు మోగిపోతుంది. ఇంతకి ఈ డైరెక్టర్ కూతురు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం చేస్తుందనే విషయాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ డైరెక్టర్ మారుతిరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..ఇండస్ట్రీలో ఉండే టాప్ డైరెక్టర్స్ లో ఈయన కూడా ఒకరు. ముఖ్యంగా ఈయనతీసిన బస్ స్టాప్, ప్రేమకథ వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాల తర్వాత నాచురల్ స్టార్ నానితో భలే భలే మగాడివోయ్ సినిమాతో మరోసారి ఇండస్ట్రీలో సక్సేస్ ఫుల్ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసుకున్నారు.అయితే చాలా కాలం బ్రేక్ తీసుకున్న మారుతి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. అసలే డార్లింగ్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ కావడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మారుతి కూతురి పేరు ఇప్పుడు నెట్టింట తెగ మారు మోగుతుంది. ఎందుకంటే.. మారుతి తాజాగా జామ్ జంక్షన్ అనే మ్యూజిక్ బ్యాండ్స్ కు సంబంధించిన కాంపిటేషన్ ప్రోగ్రాం చేయబోతున్నారు.

అయితే ఆరు మ్యూజిక్ బ్యాండ్స్ తో ఈ ప్రోగ్రాం సెప్టెంబర్ 6న ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రోగ్రాంకు సంబంధించి కొన్ని పనులను మారుతి కూతురు ‘హియా’ దగ్గరుండి చూసుకుంటున్నారు. అంతేకాకుండా.. తాజాగా ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ఓ ఈవెంట్ లో తన తండ్రితో కలిసి ఈ చిన్నది హాజరైయ్యింది. ఇక అక్కడ మీడియాతో మాట్లాడిన హియ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా హియ మాట్లాడుతూ.. ‘నేను చిన్నప్పటి నుంచి క్రియేటివ్ సైడ్ ఎక్కువగా ఆలోచించేదాన్ని. ఈ క్రమంలోనే నేను మా  నాన్న పనిలో కూడా హెల్ప్ చేశాను. ఇక  ప్రస్తుతం నేను  ఇంటర్ కంప్లీట్ చేశాను. త్వరలోనే అబ్రాడ్ వెళ్లి చదువుకుంటాను.  అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను.

Director maruthi daughter working as assistant director for prabhas movie

అంతేకాకుండా.. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాను. నాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ వర్క్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఆయనతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను. ఇక మా తమ్ముడి మ్యూజిక్ సైడ్ వెళ్తున్నాడు. ప్రస్తుతం డ్రమ్మర్స్, పియానో ప్లే చేస్తున్నాడు’ అంటూ హియా  చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న మారుతి కూతురు ఇప్పుడు మీడియా ముందుకు రావడంతో ఆమె పేర సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది. అలాగే హియా ఇంత చిన్న వయసులోనే క్రియేటివ్ గా ఆలోచించడమే కాకుండా..  అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుందా అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మారుతి కూతురు హియా క్యూట్  లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap