iDreamPost

Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్‌కు సైకాలజీ పరీక్షలు చేయాలంటూ పిటిషన్!

లోకేష్ కనకరాజ్- ఇళయదళపతి విజయ్ కాంబోలో వచ్చిన చిత్రం లియో. అక్టోబర్ 18న విడుదలైన ఈ మూవీ కోలీవుడ్ లోనే కాదూ.. తెలుగు నాట కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.

లోకేష్ కనకరాజ్- ఇళయదళపతి విజయ్ కాంబోలో వచ్చిన చిత్రం లియో. అక్టోబర్ 18న విడుదలైన ఈ మూవీ కోలీవుడ్ లోనే కాదూ.. తెలుగు నాట కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.

Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్‌కు సైకాలజీ పరీక్షలు చేయాలంటూ పిటిషన్!

గత ఏడాది దసరా బరిలోకి వచ్చిన మూవీల్లో ఒకటి లియో. ఖైదీ, విక్రమ్ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా మారిన లోకేష్ కనకరాజ్ దీనికి దర్శకుడు. ఇళయదళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లు. సంజయ్ దత్, అర్జున్, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలు పోషించారు. తమిళనాటే కాదూ.. తెలుగులో కూడా భారీ వసూళ్లను రాబట్టింది ఈ మూవీ. దాదాపు రూ. 275 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ సుమారు 615 కోట్ల రూపాయాలను కొల్లగొట్టింది. ఓటీటీలోకి విడుదలై మంచి రేటింగ్ సంపాదించింది. ఈ మూవీలో పార్తిబన్, లియో క్యారెక్టర్లలో కనిపించాడు విజయ్. ఇందులో విజయ్‌ను ఫ్యామిలీ మెన్‌గా చూపిస్తూనే.. మాస్ యాక్షన్ ఎపిసోడ్లను తెరకెక్కించాడు డైరెక్టర్ లోకి.

ఇక ఈ మూవీలో ఓ ఫైట్ సందర్భంగా వచ్చిన సాంగ్స్ ఇప్పటికీ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న సంగతి విదితమే. ఈ చిత్రం కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్‌లో భాగమని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కొన్ని రోజుల నుండి వివాదంలో నెలకొంది. లియో చిత్రంలో హింసాత్మక సన్నివేశాలున్నాయని.. ఈ మూవీని నిషేధించాలి కోరుతూ హైకోర్టులోని మధురై బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. రాజు మురుగన్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘లియో సినిమాలోని చాలా సన్నివేశాలు హింసను సమర్థిస్తున్నాయి. లోకేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మతపరమైన చిహ్నాలు, తుపాకీ సంస్కృతి, మహిళలు, పిల్లల్ని చంపాలన్న ఘోరమైన ఆలోచనలు, డ్రగ్స్ వినియోగం ఉన్నాయి’ అని పిటిషన్ లో పేర్కొన్నాడు రాజు.

అంతే కాకుండా అల్లర్లు, అక్రమ కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం, ఆయుధాల బిజినెస్, పోలీసుల సహకారంతో అన్ని నేరాలు చేయొచ్చు అన్న సంఘ వ్యతిరేక ఆలోచలనలను లియో మూవీలో చూపించారని, ఇలాంటి సినిమాలు సెన్సార్ డిపార్ట్ మెంట్ సరిగ్గా పరిశీలించాలని కోరారు. అంతేకాకుండా ఈ మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ను మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు సైకాలజీ టెస్టులు చేయించాలని పేర్కొన్నాడు పిటిషనర్. ఇలాంటి హింసాత్మకమైన చిత్రాన్ని తీసిన ఆయనపై కేసు నమోదు చేసి.. లియో చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ జస్టిస్ కృష్ణకుమార్‌, విజయకుమార్‌ ఎదుట విచారణకు వచ్చింది. లోకేశ్ కనగరాజ్ తరఫు న్యాయవాదులు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తులు విచారణను జనవరి 8కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ నిజంగానే హింసాత్మకను పెంచి పోషించిందని భావిస్తున్నట్లయితే.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి