iDreamPost
android-app
ios-app

Balakrishna: సెట్‌లో ఎవరు అలా చేసిన బాలకృష్ణ తట్టుకోలేడు.. పిలిచి కొడతాడు: కేఏస్‌ రవికుమార్‌

  • Published Mar 06, 2024 | 8:19 AM Updated Updated Mar 06, 2024 | 10:29 AM

బాలకృష్ణ గురించి దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెట్‌లో వారిని కొడతాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..

బాలకృష్ణ గురించి దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెట్‌లో వారిని కొడతాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..

  • Published Mar 06, 2024 | 8:19 AMUpdated Mar 06, 2024 | 10:29 AM
Balakrishna: సెట్‌లో ఎవరు అలా చేసిన బాలకృష్ణ తట్టుకోలేడు.. పిలిచి కొడతాడు: కేఏస్‌ రవికుమార్‌

తెలుగు టాప్‌ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. సినిమాలు, నటన సంగతి పక్కన పెడితే.. ఆయనకు ఉన్న యారోగెన్స్‌ గురించి అందరికి తెలుసు. నోటి దురుసుతో పాటు ఫ్యాన్స్‌పై చేయి చేసుకోవడం కూడా చేస్తుంటారు. ఇండస్ట్రీలో అభిమానులను కొట్టే ఏకైక హీరోగా బాలయ్య పేరు పంపాదించుకున్నాడు. ఫ్యాన్స్‌ అభిమానంతో ఆయన దగ్గరకు వస్తే.. వారిని దూరంగా తోసేయడం.. సెల్ఫీలు దిగడానికి ట్రై చేస్తే.. ఫోన్‌లు విసిరేయడం వంటి చర్యలు బాలయ్యకే సాధ్యం అవుతాయి. ఇక సినిమాల్లో ఆడవారి గురించి ఎంతో గొప్పగా భారీ డైలాగ్‌లు చెప్పే బాలయ్య.. వాస్తవంలో మాత్రం.. వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అలవాటు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెట్‌లో కొడతాడని చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..

ప్రముఖ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్.. తెలుగు వారికి కూడా పరిచితుడే. తెలుగులో బాలయ్యతో కలిసి ‘జై సింహా’, ‘రూలర్’ వంటి సినిమాలు చిత్రాలు చేశాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన గార్డియన్‌ అనే తమిళ సినిమా ప్రీ రిలీజ్‌ ఇవెంట్లో మాట్లాడుతూ.. బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. షూటింగ్‌ సందర్భంగా ఎవరు నవ్వినా బాలకృష్ణ తట్టుకోలేడని చెప్పారు. అలానే తన అసిస్టెంట్ డైరెక్టర్‌ని కూడా కొట్టడానికి రెడీ అయిపోయాడని చెబుతూ బాలయ్య నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.

రవికుమా్‌ మాట్లాడుతూ.. ‘‘షూటింగ్‌లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే బాలకృష్ణ తట్టుకోలేడు. తనని చూసే నవ్వుతున్నారని భావిస్తాడు… వెంటనే ఆయనకు కోపం వచ్చేస్తుంది. ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి కొడతాడు. అలా ఓ మూవీ షూటింగ్ చేస్తున్న టైంలో నా అసిస్టెంట్ శరవణన్‌ని ఫ్యాన్ తిప్పమని చెప్పాను. అతడు అనుకోకుండా బాలయ్య వైపు తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు అయింది. అది చూసి శవరణన్ కాస్త నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు వెంటనే కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అంటూ శరవణన్‌ మీద గట్టిగా అరిచాడు’’ అని గుర్తు చేసుకున్నాడు.

‘‘దాంతో నాకు భయం వేసి.. శరవణన్‌ని ఎక్కడ కొడతాడో అని నేనే బాలకృష్ణ దగ్గరకు వెళ్లి.. సర్ అతడు మన అసిస్టెంట్ డైరెక్టర్ అని సర్ది చెప్పాల్సి వచ్చింది. అయినా సరే అతడు వినిలేదు. వెంటనే నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అని శరవణన్‌కి అరిచి చెప్పాను. అప్పుడు బాలకృష్ణ కాస్త స్థిమిత పడ్డాడు’’ అని కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చాడు.

ప్రేక్షకులకు కూడా హీరో బాలకృష్ణ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన ప్రవర్తన. ముందు వెనక ఆలోచించకుండా ఎవరినైనా సరే కొట్టేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. బయటనే కాదు సెట్‌లోనూ ఇలా కొట్టడాలు జరుగుతుంటాయని విన్నాం. కానీ ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ చెప్పడంతో ఇది నిజమని తేలిపోయింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet girişholiganbetvaycasino