iDreamPost
android-app
ios-app

డైరెక్టర్ పక్కా ప్లాన్.. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కు రెడీ అవుతున్న కార్తి!

  • Published Nov 18, 2023 | 8:01 PM Updated Updated Nov 18, 2023 | 8:01 PM

హీరో కార్తి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ ప్రేక్షకులకు కొత్త దనాన్ని పంచుతున్నారు. కాగా గతంలో కార్తి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాకు డైరెక్టర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

హీరో కార్తి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ ప్రేక్షకులకు కొత్త దనాన్ని పంచుతున్నారు. కాగా గతంలో కార్తి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాకు డైరెక్టర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

  • Published Nov 18, 2023 | 8:01 PMUpdated Nov 18, 2023 | 8:01 PM
డైరెక్టర్ పక్కా ప్లాన్.. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కు రెడీ అవుతున్న కార్తి!

‘కార్తీ’.. ప్రస్తుతం సౌత్ లో టాప్ దూసుకెళ్తున్న స్టార్ హీరో. ఒకవైపు వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడం కార్తీ స్పెషల్. ఈ కారణంగానే.. ఈ హీరోని అందరి అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు. ఇక.. ఖైదీ మూవీతో కార్తీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీ క్యారెక్టర్ కి ఉన్న ఫ్యాన్ బేస్ అంతాఇంత కాదు. ఇప్పుడు లోకీ యూనివర్స్ లో అంతా ఖైదీ-2 కోసమే ఎదురుచుస్తున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

నిజానికి ఖైదీ తరువాత వచ్చిన సర్దార్ కూడా ఈ హీరోకి మంచి విజయాన్ని అందించింది. ఇలా సక్సెస్ ట్రాక్ లో దుకుపోతున్న ఈ పాన్ ఇండియా స్టార్ కి.. జపాన్ మూవీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. రిలీజైన తొలి వారమే ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్ స్థితికి వెళ్లిపోయింది అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఇలా.. అనుకోకుండా తగిలిన దెబ్బతో.. కార్తీ అలర్ట్ అయ్యాడు. గతంలో తనకి సూపర్ హిట్ అందించిన ఓ మూవీకి సీక్వెల్ చేసి.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలి అనుకుంటున్నాడు.

2017 లో ‘హెచ్.వినోద్ ‘ దర్శకత్వంలో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘ఖాకి’. ఈ సినిమా కార్తీకి చాలా ఫేమ్ తెచ్చిపెట్టింది. అయితే కార్తీ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు. తమిళ పోలిసుల నిజ జీవితాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. 1995-2006 మధ్య కాలంలో జరిగిన ‘ఆపరేషన్ బవారియా ‘ ఆధారంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఒక వాస్తవ కేసును తీసుకుని చాలా లోతుగా పరిశోధించి.. సినిమాకు కావాల్సిన కథను, ప్రేక్షకులను కట్టిపడేసే ఉత్కంఠ భరితమైన సన్నివేశాలను అందించారు. 2017 లో ఈ మూవీ విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినీ విమర్శకులు సైతం ఖాకి చిత్రం పైన ప్రశంసల వర్షం కురిపించారు. అయితే డైరెక్టర్ వినోద్ ఖాకి చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని కోలీవుడ్ ఇండస్ట్రీ తెలియజేస్తుంది.

ప్రస్తుతం డైరెక్టర్ వినోత్.. కమలహాసన్ “కెహెచ్ 233” కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత కార్తీతో సీక్వెల్ ప్లాన్ అమలు చేస్తాడని సమాచారం. ఇదే విషయాన్ని అక్కడ సినీ జర్నలిస్ట్ తో వినోత్ తెలిపాడు. ఇప్పటికే ఖాకి మూవీ సీక్వెల్ కు కథ సిద్ధంగా ఉందట. దానిని కార్తీకి కూడా వినిపించాడట. అయితే కమలహాసన్ తో చిత్రం పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఖాకి-2 కథను పూర్తి చేస్తానని వినోత్ తెలిపాడు. ఈ ప్రకటన తరువాత.. సూపర్ హిట్ చిత్రం ఖాకి సీక్వెల్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి.. ఖాకీకి సీక్వెల్ తెరకెక్కనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom