iDreamPost
android-app
ios-app

ప్రముఖ డైరెక్టర్‌ అట్లీకి ఘోర అవమానం.. ఆ పోస్టు అందుకేనా!

  • Published Jul 07, 2023 | 2:33 PM Updated Updated Jul 07, 2023 | 2:33 PM
  • Published Jul 07, 2023 | 2:33 PMUpdated Jul 07, 2023 | 2:33 PM
ప్రముఖ డైరెక్టర్‌ అట్లీకి ఘోర అవమానం.. ఆ పోస్టు అందుకేనా!

రాజారాణి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ. తర్వాత ఆయన తీసిన సినిమాలు మొత్తం తెలుగులో కూడా డబ్‌ అవుతూ మంచి విజయాన్ని నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో ‘జవాన్‌’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. 2023 సెప్టెంబర్‌ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక, అసలు విషయానికి వస్తే.. దర్శకుడు అట్లీ తన సోషల్‌ మీడియా ఖాతాలో పెట్టిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. పెద్ద చర్చకు కూడా దారి తీస్తోంది. అట్లీ ఆ పోస్టులో అవమానం గురించి చెప్పుకొచ్చారు. ‘‘నన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరూ అవమానించలేరు. ఎందుకంటే అది నా చేతుల్లోనే ఉంది. నేను అవమానాన్ని అంగీకరిస్తే పర్లేదు. కానీ, నేను దాన్ని అంగీకరించకపోతే.. నువ్వు దాన్ని నీతో పాటు మీ ఇంటికి తీసుకుపోవాల్సి వస్తుంది. ఎవ్వరూ నన్ను వేధించలేరు. నన్ను వేధించాలంటే.. నా అనుమతి కావాలి’’ అని పేర్కొన్నారు.

అయితే, అట్లీ ఆ పోస్టు ఎందుకు పెట్టారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన్ని ఎవరైనా అవమానించారా? అందుకే ఈ పోస్టు పెట్టారా? ఒక వేళ అవమానమే నిజమైతే.. అవమానించింది ఎవరు? ఎందుకు అవమానించారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక, ఈ పోస్టుపై నెటిజన్లు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహాగానాలు చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో ఎదురయ్యే అవమానాల గురించి ప్రజల్ని ఎడ్యుకేట్‌ చేయటానికే ఆయన ఆ పోస్టు పెట్టారని కొందరు అంటున్నారు. అసలు వాస్తవం ఏంటో తెలియాలంటే అట్లీనే స్వయంగా స్పందించాల్సిందే.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet