iDreamPost
android-app
ios-app

మరోసారి ట్రాఫిక్‌ DCPని టార్గెట్‌ చేసిన డింపుల్‌ హయతీ.. KTRను ట్యాగ్‌ చేస్తూ!

  • Published Jul 20, 2023 | 12:57 PM Updated Updated Jul 20, 2023 | 2:14 PM
  • Published Jul 20, 2023 | 12:57 PMUpdated Jul 20, 2023 | 2:14 PM
మరోసారి ట్రాఫిక్‌ DCPని టార్గెట్‌ చేసిన డింపుల్‌ హయతీ.. KTRను ట్యాగ్‌ చేస్తూ!

హీరోయిన్‌ డింపుల్‌ హయతీ, ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ మధ్య కొన్ని రోజుల క్రితం వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తమ అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్‌ ప్లేస్‌ విషయమై చోటు చేసు కున్న వివాదం కాస్త.. పోలీస్‌ స్టేషన్‌, కోర్టుల చుట్టూ తిరిగేవారకు వెళ్లింది. ఈ వివాదం కారణంగా డింపుల్‌ హయతీ బాయ్‌ఫ్రెండ్‌ గురించి, ఆమె అతడితోనే కలిసి ఉంటున్నట్లు అందరికి తెలిసింది. ప్రస్తుతానికి ఈ వివాదం ముగిసిపోయిందని అందరూ భావించారు. అయితే తాజాగా డింపుల్‌ హయాతీ చేసిన ట్వీట్‌ చూస్తే.. అయిపోయిన గొడవను డింపుల్‌ హయాతీ మళ్లీ రెచ్చగొట్టింది అనిపించక మానదు. పైగా ఈ సారి ఏకంగా మంత్రి కేటీఆర్‌ను కూడా ట్యాగ్‌ చేయడంతో.. ఆమె ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది నెటిజనులు.. డింపుల్‌ హయాతీపై విమర్శలు చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..

గత నాలుగు రోజులుగా అంటే సోమవారం నుంచి భాగ్యనగరం వర్షంలో తడిసిముద్దయిపోతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ జామ్‌ సమస్య పెరిగింది. గంటలు గంటలు.. వర్షంలో తడుస్తూ.. ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉండాల్సి వస్తోంది. తప్పదు.. సాధారణ రోజుల్లోనే భారీ ట్రాఫిక్‌ ఉంటుంది.. అలాంటిది ఇక వర్షం పడితే కొత్తగా చెప్పేది ఏం ఉంది. అయితే ట్రాఫిక్‌ సమస్యపై డింపుల్‌ హయాతీ అసహనం వ్యక్తం చేసింది. పనిలో పనిగా.. పాత వివాదాన్ని మనసులో పెట్టుకుని.. ట్రాఫిక్‌ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ.. డీసీపీ రాహుల్‌ని ఇండైరెక్ట్‌గా టార్గెట్‌ చేస్తూ.. ట్వీట్‌ చేసింది. అంతటితో ఆగక.. కేటీఆర్‌ కూడా ట్యాగ్‌ చేసింది.

డింపుల్‌ హయాతీ చేసిన ట్వీట్‌లో ఇలా ఉంది.. ‘‘ఇంటికి వెళ్లాలంటే.. గంటకు పైగా సమయం పడుతుంది. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా.. మెడికల్‌ ఎమర్జెన్సీ ఏర్పడితే అప్పుడు ఏంటి.. ట్రాఫిక్‌ డీసీపీలు ఏం చేస్తున్నారు.. అసలు హైరదాబాద్‌లో కాలు బటయపెట్టే పరిస్థితులు ఉన్నాయా.. ప్రభుత్వ ప్రతినిధులారా.. మాకు పెట్రోల్‌ ఉచితంగా రావడం లేదు కదా’’ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. కేటీఆర్‌ని, సీఎంఓ కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ.. డింపుల్‌ హయాతీ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం నె ట్టింట వైరల్‌గా మారింది.

డింపుల్‌ హయాతీ ట్రాఫి​క్‌ డీసీపీని టార్గెట్‌ చేయాలనుకుంది.. చేసింది.. మధ్యలో కేటీఆర్‌ను లాగడమెందుకు.. చూడబోతే ఆమె వ్యక్తిగత గొడవ కారణంగానే ట్రాఫిక్‌ సమస్యపై స్పందించినట్లుగా ఉంది.. అంటూ కామెంట్‌ చేస్తున్నారు జనాలు. ఇక సినిమాల విషయానికి వస్తే.. డింపుల్‌ హయాతీ కెరీర్‌ అంత ఆశాజనకంగా ఏం లేదు. ఆమె లేటెస్ట్ మూవీ రామబాణం డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించారు. ఖిలాడి, రామబాణం చిత్రాలపై డింపుల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వాటి ఫలితం మాత్రం బెడిసి కొట్టింది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş