iDreamPost

వెక్కిరించిన వారితోనే విజిల్స్ వేయించుకున్న ఈ నటుడ్ని గుర్తుపట్టారా?

  • Published Jun 05, 2024 | 10:22 PMUpdated Jun 05, 2024 | 10:22 PM

Did You Recognize: వెక్కిరించిన వారితోనే విజిల్స్ వేయించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ లాంటి వారు కూడా ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్నవారే. ఆ తర్వాత తమ సక్సెస్ తో అవమానాలను అభిమానంగా మార్చుకున్నారు. వీరి బాటలోనే మరొక నటుడు వెక్కిరించిన వారితో విజిల్స్ వేయించుకున్నారు. ఆయన ఎవరంటే?

Did You Recognize: వెక్కిరించిన వారితోనే విజిల్స్ వేయించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ లాంటి వారు కూడా ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్నవారే. ఆ తర్వాత తమ సక్సెస్ తో అవమానాలను అభిమానంగా మార్చుకున్నారు. వీరి బాటలోనే మరొక నటుడు వెక్కిరించిన వారితో విజిల్స్ వేయించుకున్నారు. ఆయన ఎవరంటే?

  • Published Jun 05, 2024 | 10:22 PMUpdated Jun 05, 2024 | 10:22 PM
వెక్కిరించిన వారితోనే విజిల్స్ వేయించుకున్న ఈ నటుడ్ని గుర్తుపట్టారా?

జీవితంలో ఎదిగే క్రమంలో వెక్కిరింపులు, అవమానాలు అనేవి మామూలే. అయితే వెక్కిరించిన వారితోనే విజిల్స్ వేపించుకోవడం అంత ఈజీ కాదు. అవమానించిన వారిని అభిమానించేలా చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇలా అవమానాలను అభిమానంగా మార్చుకునేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి కూడా అలాంటి కోవకు చెందిన వ్యక్తే. లావుగా ఉన్నా, నల్లగా ఉన్నా, అందంగా లేకపోయినా సమాజం వెక్కిరిస్తుంటుంది. ఆ అవతారం ఏంటి అని అనేస్తుంది. ఈయన కూడా ఒకప్పుడు అలా వెక్కిరింపులకు గురైన వారే. ఈయన ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యారు. స్టార్ కమెడియన్ గా ఎదిగారు. ఈయన ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్ అన్న టాక్ వస్తుంది.

ఈయన పండించే కామెడీ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఈయన టైమింగ్ వేరే లెవల్లో ఉంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ స్టార్ కమెడియన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మెర్సల్, వరుణ్ డాక్టర్, జైలర్ వంటి అనేక సినిమాల్లో కమెడియన్ గా నటించారు. హీరోగా కూడా పలు సినిమాల్లో కూడా నటించారు. నిజానికి ఈయన కోలీవుడ్ నటుడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులయ్యారు. ఈయన పాత్రకు చెప్పే డబ్బింగ్ వాయిస్, ఆయన హావభావాలకు తగ్గట్టు మ్యాచ్ అవ్వడంతో ఇక్కడ కూడా ఆయన బాగా ఫేమస్ అయ్యారు. హీరోల రేంజ్ లో ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మూవీలో కూడా కమెడియన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈయన రోజుకు 12 లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా పెంచినట్లు టాక్. అయితే ఖచ్చితంగా ఇంతే ఇవ్వాలని తానెప్పుడూ డిమాండ్ చేయలేదని ఇటీవల మీడియాకి క్లారిటీ ఇచ్చారు. తనకు మొదట్లో 2 వేల రూపాయలు ఇచ్చారని.. నిర్మాతల కష్టం తనకు తెలుసునని.. అందరూ అనుకున్నంత రెమ్యునరేషన్ తనకు రాదని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అయిపోయారు. హర, కంగువ, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టీమ్, నాన్ వయొలెన్స్ సినిమాల్లో నటిస్తున్నారు.

ఇంత పాపులారిటీ సంపాదించిన ఆయన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. తన లుక్ చూసి చాలా మంది ఆ అవతారం ఏంటి అంటూ బాడీ షేమింగ్ చేశారని.. అయితే ఆ విమర్శలను తాను పట్టించుకోలేదని.. కామెడీకి బాడీ లాంగ్వేజ్ ఒకటే ముఖ్యం అని భావించానని.. తన బాడీని అందుకు వాడుకున్నానని అన్నారు. తనను వెక్కిరించిన వాళ్లే ఇప్పుడు థియేటర్స్ లో ఆయన బొమ్మ కనబడితే విజిల్స్ వేసే పరిస్థితి. ఆయన మరెవరో కాదు.. కమెడియన్ యోగిబాబు. తనదైన కామెడీతో తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మరో హాస్య బ్రహ్మ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి