కింది ఫొటోలో కనిపిస్తున్న ఈ బుడతడు 80, 90 దశకాల్లో ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు. ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. పరిశ్రమకు విలన్ అవుదామని వచ్చి.. హీరోగా ఓ వెలుగు వెలిగాడు.
కింది ఫొటోలో కనిపిస్తున్న ఈ బుడతడు 80, 90 దశకాల్లో ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు. ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. పరిశ్రమకు విలన్ అవుదామని వచ్చి.. హీరోగా ఓ వెలుగు వెలిగాడు.
సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటులుగా పేరొందిన ఎంతోమంది కష్టం అనే సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చినవారే. వీరందరూ తమకు ఇష్టమైనది సాధించేవరకు ఎంతైనా కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి కష్టాలనే ఎదుర్కొన్ని ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్స్ అందించాడు ఈ హీరో. అన్నం దొరక్క, ఫుట్ పాత్ లపై ఏడుస్తూ.. అష్టకష్టాలు పడి.. జీరో నుంచి స్టార్ హీరోగా ఎదిగిన ఈ పిల్లాడిని మీరు గుర్తుపట్టారా. పరిశ్రమలో తనను హీరోగా ఎవ్వరు తీసుకోరని, అందుకే విలన్ అవ్వాలనుకున్నాడట ఈ హీరో. పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో కూడా ఇతడు నటించాడు. మరి ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్స్ అందించిన ఈ బుడతడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ బుడతడు 80, 90 దశకాల్లో ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు. ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. పరిశ్రమకు విలన్ అవుదామని వచ్చి.. హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఈ పిక్ లో ఉన్న పిల్లాడు మరెవరో కాదు.. బాలీవుడ్ ను తన నటనతో మెస్మరైజ్ చేసిన ‘మిథున్ చక్రవర్తి’. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని తాను ఈ స్థాయికి వచ్చినట్లు ఓ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మిథున్. ఇక మిథున్ అతడిని హీరోగా ఇండస్ట్రీ అంగీకరించదని తొలుత విలన్ అవ్వాలనుకున్నాడట. చాలా రోజులు అన్నం తినకుండానే ఫుట్ పాత్ లపై పడుకున్నాడని ఓ షోలో కూడా చెప్పుకొచ్చాడు.
ఇక అవకాశాల కోసం తిరిగే క్రమంలో.. అన్నం కోసం పార్టీల్లో డ్యాన్స్ లు కూడా చేశాడు మిథున్. ఇన్ని కష్టాలను భరించలేక చనిపోదమని కూడా అనుకున్నాడని తెలిపాడు. ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే.. 1976లో వచ్చిన ‘మృగయ’ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఇతడు నటించిన తొలి సినిమానే జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. ఆ తర్వాత సురక్ష, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, కసమ్ ఫాయిదా కరనే వాలేకీ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించాడు మిథున్ చక్రవర్తి. 80, 90 దశకాల్లో ఆయన చేసిన సినిమాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. తెలుగులో వెంకటేష్, పవన్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ మూవీలో లీలాధర స్వామి పాత్రలో కనిపించాడు.