iDreamPost
android-app
ios-app

ధనుష్ పెద్ద కుమారుడికి జరిమానా..ఎందుకంటే..?

సామాన్యులైతే ఏంటీ, సెలబ్రిటీలు అయితే ఏంటీ చట్టం ముందు అందరూ సమానమే. సగటు మనిషి తప్పు చేస్తే.. అది వార్త కాదు కానీ, సినీ ప్రముఖులు, వారి పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే వార్తలో నిలవాల్సిందే. తాజాగా ఓ ప్రముఖ నటుడి కుమారుడు..

సామాన్యులైతే ఏంటీ, సెలబ్రిటీలు అయితే ఏంటీ చట్టం ముందు అందరూ సమానమే. సగటు మనిషి తప్పు చేస్తే.. అది వార్త కాదు కానీ, సినీ ప్రముఖులు, వారి పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే వార్తలో నిలవాల్సిందే. తాజాగా ఓ ప్రముఖ నటుడి కుమారుడు..

ధనుష్ పెద్ద కుమారుడికి జరిమానా..ఎందుకంటే..?

చట్టం ముందు అందరూ సమానమే. తప్పు అని నిరూపణైతే విధించే శిక్షలు ఒక్కటే. సామాన్యులను ఒకలా, సెలబ్రిటీలను మరోలా ట్రీట్ చేయదు లా. అదే పొరపాట్లు చేస్తే చిన్న ఫైన్లతో సరిపెడుతుంది. సామాన్యంగా మామూలు వ్యక్తులు తప్పులు చేసి.. జరిమానాకు గురైతే.. పెద్ద చర్చ కాదు కానీ.. స్టార్స్, వారి పిల్లలకు పోలీసులు ఫైన్ వేస్తే వార్తల్లోకి ఎక్కాల్సిందే కదా. ఎందుకంటే సెలబ్రిటీలు (ముఖ్యంగా సినీ నటులు) వారు చేసే పనులను సగటు మనిషి ఆదర్శంగా తీసుకుని ఇన్ స్పైర్ అవుతుంటారు. ఇప్పుడు ఓ స్టార్ కుమారుడు ఓ చిన్న పొరపాటు చేయడంతో వివాదానికి దారి తీసింది. ఆ సెలబ్రిటీ, ఆ పుత్రుడు ఎవరో కాదూ సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు, మాజీ అల్లుడు ధనుష్ గారాల కుమారుడు యాత్ర.

ప్రముఖ నటుడు ధనుష్-రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దంపతులు తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి గత ఏడాది స్వస్థి పలికిన సంగతి విదితమే. ఈ విషయం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వీరికి ఇద్దరు కుమారులు యాత్ర, లింగ. ప్రస్తుతం ధనుష్-ఐశ్వర్యలు తమ కెరీర్ పై దృష్టి సారిస్తున్నారు. ధనుష్ పోయిస్ గార్డెన్‌లో కొత్త ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య పోయెస్ గార్డెన్‌లోనే పిల్లలతో కలిసి ఉంటుంది. పిల్లలిద్దరూ తల్లిదండ్రులిద్దరి ఇళ్లకు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పెద్ద కుమారుడు యాత్ర.. ఆర్ 15 బైక్ నడుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే పెను దుమారానికి కారణమైంది. ఎందుకంటే అతడికి ఇంకా 18 ఏళ్లు నిండలేదు.

అంతేకాకుండా పోయిస్ గార్డెన్ వంటి ఏరియాలో హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా, కేవలం మాస్క్ ధరించి డ్రైవింగ్ చేయడంతో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే అతడు వీడియో తీస్తున్న సమయంలో యాత్ర సహాయకుడు వీడియో తీయొద్దు అంటూ అడ్డుపడ్డాడు. ఈ వీడియో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళడంతో.. నంబర్ ప్లేట్ ఆధారంగా ధనుష్, ఐశ్వర్యల కుమారుడని నిర్దారించుకుని.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడికి వెయ్యి రూపాయాలు జరిమానా విధించారు. ఇటీవల యాత్ర దీపావళిని తల్లి ఐశ్వర్య, తాత రజనీకాంత్‌తో జరుపుకున్న ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేసిన సంగతి విదితమే.