iDreamPost
android-app
ios-app

Dhanush: ‘కెప్టెన్ మిల్లర్’కు కష్టాలు.. సినిమాను కొనేవాళ్లే లేరా? కారణం ఏంటంటే?

  • Author Soma Sekhar Published - 02:58 PM, Mon - 4 December 23

'కెప్టెన్ మిల్లర్' అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు స్టార్ హీరో ధనుష్. కానీ ఈ సినిమాకు ఇప్పుడు కష్టాలు వచ్చి పడ్డట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ధనుష్ మూవీకి వచ్చిన కష్టాలు ఏంటి? ఆ వివరాలు..

'కెప్టెన్ మిల్లర్' అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు స్టార్ హీరో ధనుష్. కానీ ఈ సినిమాకు ఇప్పుడు కష్టాలు వచ్చి పడ్డట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ధనుష్ మూవీకి వచ్చిన కష్టాలు ఏంటి? ఆ వివరాలు..

  • Author Soma Sekhar Published - 02:58 PM, Mon - 4 December 23
Dhanush: ‘కెప్టెన్ మిల్లర్’కు కష్టాలు.. సినిమాను కొనేవాళ్లే లేరా? కారణం ఏంటంటే?

ధనుష్.. కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ ఏడాది మెుదట్లో ‘సార్’ అనే క్లాస్ మూవీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది ‘కెప్టెన్ మిల్లర్’ అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్, గ్లింప్స్ కు విశేష స్పందన లభించింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమాకు ఇప్పుడు కష్టాలు వచ్చి పడ్డట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ధనుష్ మూవీకి వచ్చిన కష్టాలు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కెప్టెన్ మిల్లర్.. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న హై వోల్టేజ్ మూవీ. బ్రిటీష్ కాలంలో జరిగే తిరుగుబాటు కథతో వస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా.. ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలవాలనుకుంటోంది. కానీ కెప్టెన్ మిల్లర్ కు అనుకోకుండా చిక్కులు వచ్చి పడ్డట్లు తెలుస్తోంది. తెలుగులో ధనుష్ కు మంచి మార్కెటే ఉంది. కానీ ఇక్కడ ఈ మూవీని రిలీజ్ చేయడానికి ఇప్పుడు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదట. దానికి ఓ సాలిడ్ రీజన్ ఉంది.

సంక్రాంతికి తెలుగు సినిమాలకే ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్’, హనుమాన్, నా సామిరంగ లాంటి భారీ చిత్రాలు ఉన్నాయి. దీంతో డబ్బింగ్ సినిమా వైపు ప్రేక్షకులు చూడరని భావిస్తున్నారట మూవీ కొందమనుకునే వాళ్లు. అదీకక కెప్టెన్ మిల్లర్ కు ఎక్కువ రేట్లు చెప్తున్నారట. ఈ రెండు కారణాల వల్లే కెప్టెన్ మిల్లర్ ను కొనేవారు లేరని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఈ చిత్రం మూడు పార్ట్ లుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ధనుష్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇలాంటి కష్టాలు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.