Dharani
Inter Board Exams 2024: తాజాగా విడుదలైన ఇంటర్ బోర్డు పరీక్ష ఫలితాల్లో తమిళ సెలబ్రిటీల పిల్లలు సత్తా చాటుతున్నారు. సూర్య కుమార్తె మంచి మార్కులు సాధించగా.. ఈ జాబితాలోకి ధనుష్ కుమారుడు కూడా చేరాడు. ఆ వివరాలు..
Inter Board Exams 2024: తాజాగా విడుదలైన ఇంటర్ బోర్డు పరీక్ష ఫలితాల్లో తమిళ సెలబ్రిటీల పిల్లలు సత్తా చాటుతున్నారు. సూర్య కుమార్తె మంచి మార్కులు సాధించగా.. ఈ జాబితాలోకి ధనుష్ కుమారుడు కూడా చేరాడు. ఆ వివరాలు..
Dharani
సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు అంటే జనాల్లో కొన్ని అభిప్రాయాలు పాతుకుపోయి ఉంటాయి. వారికేంటి తల్లిదండ్రులు బోలేడు డబ్బులు సంపాదిస్తారు.. వీళ్లు దర్జాగా ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. లగ్జరీ లైఫ్.. మనలా కష్టపడి చదవాలి.. మంచి మార్కులు తెచ్చుకోవాలి అనే బాదరబందీలు ఉండవు అనుకుంటారు. ఈ విషయంలో బాలీవుడ్ సెట్రిటీల పిల్లలతో పోలిస్తే.. మన దక్షిణాది వాళ్లు కాస్త మెరుగ్గా ఉంటారు. ఇక తాజాగా వెల్లడైన ఇంటర్ ఫలితాలు చూస్తే ఇది అర్థం అవుతుంది. ఈ రిజల్ట్స్‌లో మన సౌత్ సెలబ్రిటీల పిల్లలు సత్తా చాటారు. హీరో సూర్య కుమార్తే.. ఇంటర్లో 600 మార్కులకి గాను ఏకంగా 581 మార్కులు సాధించి.. సత్తా చాటింది. ఇక తాజాగా ఈ జాబితాలో హీరో ధనుష్ కుమారుడు కూడా చేరాడు. 600కి గాను 550కి పైగా మార్కులు సాధించాడు. ఆ వివరాలు..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లు కొద్దిరోజుల క్రితమే విడాకుల విషయంలో వార్తల్లో నిలిచారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలుగా విడిపోయినా.. పిల్లల కోసం తల్లిదండ్రులుగా వారి బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ధనుష్-ఐశ్వర్యల పెద్ద కుమారుడు.. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 600కి గాను ఏకంగా 550కి పైగా మార్కులు సాధించడంతో.. అతడిని ప్రశంసిస్తున్నారు.
ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 600 మార్కులకు గాను మొత్తం 569 మార్కులు సాధించినట్లు సమాచారం. తమిళ్‌లో 100కి 98, ఇంగ్లీష్‌లో 92, గణితంలో 99, ఫిజిక్స్‌లో 91, బయాలజీలో 97, కెమిస్ట్రీలో 92 మార్కులు సాధించినట్లు ఇంటర్నెట్‌లో ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటికీ, వారు తమ ఇద్దరు పిల్లలను బాధ్యతగానే చూసుకుంటున్నారు.
లాల్ సలామ్ మ్యూజిక్ లాంచ్ పార్టీలో ఐశ్వర్యతో పాటుగా యాత్ర, లింగ కనిపించారు. కెప్టెన్ మిల్లర్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో పిల్లలు ఇద్దరూ కూడా ధనుష్‌తో కలిసి సందడి చేశారు. యాత్రకు 18 ఏళ్లు కాగా, చిన్న కుమారుడు లింగాకు 14 ఏళ్లు. వీరిద్దరూ చెన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుకున్నట్లు సమాచారం.
ఇక సూర్య-జ్యోతికల కుమార్తె దియా 12వ తరగతి పరీక్షల్లో రికార్డు స్థాయి మార్కులు సాధించింది. తమిళ్ లో వందకు 96, ఇంగ్లీష్ లో 97, అకౌంట్స్ లో 94, ఫిజిక్స్ లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్ లో 97 మార్కులు వచ్చాయి. మొత్తం 600కి 581 మార్కులు వచ్చాయి. 96.83 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ ఎగ్జామ్స్ లోనే కాదు.. పదో తరగతి పరీక్షల్లో కూడా సత్తా చాటింది. ఏకంగా 97 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించింది.