iDreamPost
android-app
ios-app

Dhanush: ‘అవెంజర్స్’ సిరీస్ లోకి ధనుష్? ఇదెక్కడి క్రేజ్ సామీ..

  • Published Aug 07, 2024 | 8:30 AM Updated Updated Aug 07, 2024 | 8:30 AM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి హాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా అవెంజర్స్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో ధనుష్ కనిపించనున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి హాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా అవెంజర్స్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో ధనుష్ కనిపించనున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 07, 2024 | 8:30 AMUpdated Aug 07, 2024 | 8:30 AM
Dhanush: ‘అవెంజర్స్’ సిరీస్ లోకి ధనుష్? ఇదెక్కడి క్రేజ్ సామీ..

ధనుష్.. కోలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఇతర హీరోల కంటే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఈ హీరో. లేటెస్ట్ గా ‘రాయన్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. భారీ కలెక్షన్లను సాధిస్తూ.. ఈ చిత్రం థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ధనుష్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. ఇప్పటికే ఓ హాలీవుడ్ మూవీలో నటించిన ఈ హీరో.. తాజాగా మరోసారి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా అవెంజర్స్ సిరీస్ లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ధనుష్ మరోసారి హాలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఏకంగా అవెంజర్స్ సిరీస్ లో నటించబోతున్నాడని తెలుస్తోంది. అవెంజర్స్ సిరీస్ లో నెక్ట్స్ అవెంజర్స్: డూమ్స్ డే, అవెంజర్స్; సీక్రెట్ వార్ చిత్రాలు రాబోతున్నాయి. ఇక వీటికి అవెంజర్స్ ఎండ్ గేమ్ కు దర్శకత్వం వహించిన రూసో బ్రదర్సే డైరెక్షన్ చేస్తారని మార్వెల్ సంస్థ ప్రకటించింది.

ఇదిలా ఉండగా.. రాబర్ట్ డౌనీ జూనియర్ అవెంజర్స్: డూమ్స్ డే లో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో ధనుష్ నటిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన టాక్స్ జరుగుతున్నాయట. ఇప్పటికే రూసో బ్రదర్స్ తో ధనుష్ మూవీ చేశాడు కాబట్టి.. అవెంజర్స్ లో నటించే ఛాన్స్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ న్యూస్ కాస్త వైరల్ కావడంతో.. ఇదెక్కడి క్రేజ్ సామీ అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet