iDreamPost
android-app
ios-app

Devil Trailer: శవాలు సాక్ష్యం చెప్పడం చూశారా? డెవిల్‌ ట్రైలర్‌ అదిరిపోయింది!

  • Published Dec 12, 2023 | 5:43 PM Updated Updated Dec 13, 2023 | 12:30 PM

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ‘డెవిల్‌’ సినిమా డిసెంబర్‌ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ ఎలా ఉందంటే..

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ‘డెవిల్‌’ సినిమా డిసెంబర్‌ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ ఎలా ఉందంటే..

  • Published Dec 12, 2023 | 5:43 PMUpdated Dec 13, 2023 | 12:30 PM
Devil Trailer: శవాలు సాక్ష్యం చెప్పడం చూశారా? డెవిల్‌ ట్రైలర్‌ అదిరిపోయింది!

డెవిల్‌ విషయంలో కల్యాణ్‌ రామ్‌ అభిమానుల నెలల ఎదురు చూపుకు తెరపడింది. విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు కొద్దిరోజుల క్రితమే డెవిల్‌ నిర్మాతలు తెరదించారు. డిసెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో చిత్రం విడుదల కానున్నట్లు తెలిపారు. విడుదలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. సినిమా టీం ట్రైలర్‌ను విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం 5.39 నిమిషాలకు ట్రైలర్‌ యూట్యూబ్‌లోకి వచ్చింది.

ఇక, డెవిల్‌లో కల్యాణ్‌ రామ్‌ బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కనిపించనున్నారు. కల్యాణ్‌ రామ్‌ ఇప్పటి వరకు చేసిన పాత్రల కంటే ఈ పాత్ర భిన్నంగా ఉండనుందట. దర్శకుడు అభిషేక్‌ నామా చాలా ప్రత్యేకంగా పాత్రను డిజైన్‌ చేశారట. మూవీలో లుక్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. డెవిల్‌ పాత్ర కోసం ఏకంగా 90 కాస్ట్యూమ్స్‌ రూపొందించారు. అది కూడా ఇటలీ నుంచి తెప్పించిన మోహైర్‌ ఊలుతో ఏకంగా 60 బ్లేజర్లను తయారు చేశారు. వీటితో పాటు 25 స్పెషల్‌ వెయిస్ట్‌ కోటులను తయారు చేశారు.

బ్లేజర్‌ పక్కన లేలాడుతూ ఉండే వాచ్‌ను కూడా స్పెషల్‌గా డిజైన్‌ చేశారు. వీటితో భారత సంప్రదాయం ఉట్టిపడేలా.. ధోతీలను కూడా తయారు చేశారు. వీటితో కల్యాణ్‌రామ్‌ లుక్‌ మరింత అద్భుతంగా తయారైంది. ట్రైలర్‌లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 2.19 నిమిషాల ట్రైలర్‌లో కల్యాణ్‌ రామ్‌ లుక్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 70 ఎమ్‌ఎమ్‌ స్క్రీన్‌ మీద ఆ లుక్స్‌లో కల్యాణ్‌రామ్‌ను చూడటం ఫ్యాన్స్‌కు పండగలాగే ఉంటుంది.

ట్రైలర్‌ ఎలా ఉందంటే.. 

ట్రైలర్‌ స్టార్ట్‌ అవ్వగానే డెవిల్‌ మర్డర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా అనిపిస్తుంది.. కొన్ని సెకన్లు గడవగానే జోనర్‌ మారిపోతుంది. పిరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా మారుతుంది. బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌కు మర్డర్‌ కేసుకు సంబంధం ఏంటన్నదే అసలు కథ. బింబిసారలా కాకుండా ఈ మూవీ కథ మొత్తం బ్రిటీష్‌ ఎరాలోనే సాగుతుందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.   కల్యాణ్‌రామ్‌ మరోసారి వన్‌ మ్యాన్‌ ఆర్మీ షో చేసేశారు. తన యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. ట్రైలర్‌ ఉన్న రెండు డైలాగులు కూడా విజిల్స్‌ వేయించేలా ఉన్నాయి. మొత్తానికి సినిమా విజువల్‌ ఫీస్ట్‌లా ఉండబోతోందని అర్థం అవుతోంది.

కాగా, ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌కు జంటగా.. సంయుక్త మీనన్‌, మాళవిక నాయర్‌ నటించారు. అభిషేక్‌ నామా దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతల్ని కూడా చేపట్టారు. ఫస్ట్‌ గ్లిప్స్‌ విడుదలైన తర్వాత.. సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ట్రైలర్‌తో ఆ అంచనాలు ఆకాశాన్ని అంటాయి. సినిమా విడుదల కోసం అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాడు. మరి, కల్యాణ్‌ రామ్‌ డెవిల్‌ చిత్ర ట్రైలర్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetaresbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio