iDreamPost
android-app
ios-app

తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. దేవర నుంచి ఫస్ట్ సింగల్ అప్పుడే..

  • Published May 07, 2024 | 12:03 PM Updated Updated May 07, 2024 | 12:03 PM

తారక్ పుట్టిన రోజు సందర్బంగా ఈసారి ఈ హీరో అభిమానులకు మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఉండబోతున్నాయని.. సోషల్ మీడియాలో బాగా బజ్ నడుస్తుంది. మరి సోషల్ మీడియాలో నడుస్తున్న బజ్ ఏంటో.. తారక్ అభిమానులకు రాబోయే గిఫ్ట్స్ ఏంటో చూసేద్దాం.

తారక్ పుట్టిన రోజు సందర్బంగా ఈసారి ఈ హీరో అభిమానులకు మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఉండబోతున్నాయని.. సోషల్ మీడియాలో బాగా బజ్ నడుస్తుంది. మరి సోషల్ మీడియాలో నడుస్తున్న బజ్ ఏంటో.. తారక్ అభిమానులకు రాబోయే గిఫ్ట్స్ ఏంటో చూసేద్దాం.

  • Published May 07, 2024 | 12:03 PMUpdated May 07, 2024 | 12:03 PM
తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. దేవర నుంచి ఫస్ట్ సింగల్ అప్పుడే..

ఈ మధ్య కాలంలో నడుస్తున్న ట్రెండ్ ఒకటే.. స్టార్ సెలెబ్రిటీల పుట్టిన రోజులకు.. వారి వారి కొత్త సినిమాల నుంచి.. వారికీ సంబంధించిన లుక్స్ కానీ పోస్టర్స్ కానీ రివీల్ చేయడం. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎంతో మంది సెలెబ్రెటీలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ను చూశాము. ఇక ఇప్పుడు తారక్ వంతు.. ఈ నెలలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉన్న సంగతి తెలిసిందే. దీనితో అభిమానులంతా తారక్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఎమన్నా వస్తాయేమో అని.. ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న బజ్ ప్రకారం.. ఈసారి ఎన్టీఆర్ బర్త్ డే కి భారీగానే రిటర్న్ గిఫ్ట్స్ ఉండబోతున్నాయి. అవేంటో చూసేద్దాం.

ప్రస్తుతం తారక్ నటిస్తున్న సినిమాలు దేవర , వార్ -2.. దేవర సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక వార్ -2 సినిమా కోసం కొన్ని రోజుల క్రితం తారక్ ముంబై వెళ్లిన సంగతి కూడా తెలిసిందే. అందుకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక తమ అభిమాన హీరో తెరపైన కనిపించి చాలా నెలలు గడిచిపోయింది కాబట్టి.. ఎప్పుడెప్పుడు తారక్ ను చూద్దామా అని అందరూ ఎదురుచూస్తున్న క్రమంలో.. అందరికి కాస్త ఊరట కలిగించేలా తారక్ బర్త్ డే రోజున.. తారక్ చిత్రాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇవ్వనున్నారట మేకర్స్. వార్-2 చిత్రానికి సంబంధించి తారక్ ఫస్ట్ లుక్, దేవర చిత్రానికి సంబంధించి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే దేవర బృందం చెన్నైలో అనిరుద్ తో ఓ మ్యూజికల్ వీడియోను షూట్ చేస్తున్నారట. దానిని మే 20 న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ చెబుతున్నాయి.

మరి అవి ఎలా ఉండబోతున్నాయి.. ఫ్యాన్స్ కు ఏ రేంజ్ లో కిక్ ఇవ్వబోతున్నాయో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక దేవర సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే మిగిలి ఉండడంతో షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక వార్ -2 చిత్రాన్ని 2025 ఆగస్ట్ 14వ రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే మూవీ ప్రకటించింది. అనుకున్న టైమ్ కు షూటింగ్ పూర్తయితే మాత్రం.. ఈ సినిమా వారు చెప్పిన తేదికి విడుదల అవుతుంది. ఈసారి తారక్ అభిమానులంతా కూడా కాలర్ ఎగేరేసుకునేలా సినిమాలు ఉండబోతున్నాయని చెప్పి తీరాల్సిందే. మరి ఈ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabet