Tirupathi Rao
Devara Chuttamalle Song Lyrics In Telugu: దేవర పార్ట్ 1 నుంచి తాజాగా జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ డ్యూయెట్ వచ్చేసింది. ఈ సాంగ్ స్లో పాయిజన్ లా ప్రేక్షకులను పట్టి పిండేస్తోంది. మరి.. ఈ సాంగ్ ఫుల్ లిరిక్స్ ఒకసారి మీరూ చూసేయండి.
Devara Chuttamalle Song Lyrics In Telugu: దేవర పార్ట్ 1 నుంచి తాజాగా జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ డ్యూయెట్ వచ్చేసింది. ఈ సాంగ్ స్లో పాయిజన్ లా ప్రేక్షకులను పట్టి పిండేస్తోంది. మరి.. ఈ సాంగ్ ఫుల్ లిరిక్స్ ఒకసారి మీరూ చూసేయండి.
Tirupathi Rao
టాలీవుడ్, బాలీవుడ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన డ్యూయెట్ రానే వ్చింది. దేవర పార్ట్ 1 నుంచి చుట్టమల్లే చుట్టేస్తాంది తంటరి అనే సాంగ్ వచ్చేసింది. నిజానికి ఇప్పటి వరకు తారక్ ని, జాన్వీ కపూర్ ని ఏ సినిమాలో కూడా ఇంత లవ్లీగా చూసుండరు. ఈ డ్యూయెట్ లో మాత్రం ఎంతో అందంగా, చూడగానే ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. పైగా ఫస్ట్ సాంగ్ కి ఈ సెకండ్ సాంగ్ కి అస్సలు కంపారిజనే లేదు. మొదటి పాటలో తారక్ గురించి వింటే భయమేస్తుంది. ఈ పాటలో తారక్ లుక్స్ చూస్తే అచ్చం లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. ఇంక జాన్వీ కపూర్ కూడా గతంలో వచ్చిన పోస్టర్ చూస్తే లంగా ఓణీలో కనిపించింది. కానీ, ఈ సాంగ్ లో మాత్రం దేవకన్యలా ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ లో ఇలాంటి ఒక డ్యూయెట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. అటు మోడ్రన్ సంగీతంతో.. ఇటు తెలుగు సాహిత్యాన్ని కలిపేస్తూ తీసుకొచ్చిన ఈ సాంగ్ కు సినిమా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. హీరో- హీరోయిన్ కాస్ట్యూమ్స్ సెలక్షన్ నుంచి.. లొకేషన్, కొరియోగ్రఫీ, తారక్- జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ మొత్తం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. ఈ సాంగ్ కి ఓవరాల్ గా మంచి మార్కులు పడుతున్నాయి. అలాగే ఈ సాంగ్ లో మరీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన ఒక అంశం ఉంది. అదే ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ గురించి. ఇవి చిన్నగా ఆడియన్స్ హృదయాన్ని తాకేస్తున్నాయి. ఆడియన్స్ ఎలాగు ఈ సాంగ్ ని కంఠస్తం చేసేస్తారు. అలాంటి వారికి ఉపయోగ పడుతుంది అని.. తెలుగు లిరిక్స్ ఇలా అందిస్తున్నాం.
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు
అస్తమానం నీ లోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపు
రా నా నిద్దర కులాసా ని కలలకిచ్చేశా
నీ కోసం వయసు వాకిలి కాశా
రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్ధం చేశా
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టింది.. వయ్యారం
ఓణీ కట్టింది గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది
మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరి
వాస్తుగా పెంచానిట్టా వందకోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరి
చెయ్యరా ముద్దుల దాడి
ఇష్టమేలే నీ సందడి
ముట్టడించి ముట్టేసుకోలేవ
ఓసారి చెయిజారి
రా ఏ బంగరు నక్లీసు. నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నను సింగారించు
రా ఏ వెన్నెల జోలాలి నను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టింది వయ్యారం
ఓణీ కట్టింది గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది