iDreamPost
android-app
ios-app

పుష్ప VS దేవర.. కొత్త డేట్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందా?

Pushpa 2 vs Devara: టాలీవుడ్ లో ఒక పెద్ద బాక్సాఫీస్ యుద్ధం జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కొత్త రిలీజ్ డేట్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడపోతున్నారు.

Pushpa 2 vs Devara: టాలీవుడ్ లో ఒక పెద్ద బాక్సాఫీస్ యుద్ధం జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కొత్త రిలీజ్ డేట్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడపోతున్నారు.

పుష్ప VS దేవర.. కొత్త డేట్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందా?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. నిజానికి పాన్ వరల్డ్ స్థాయిలో కూడా సత్తా చాటుతున్నాయి. తెలుగు సినిమా ఈ స్థాయికి రావడంలో కృషి చేసిన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా ఉంటారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బన్నీ తన పేరును మారుమోగించాడు. తారక్ అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. ఈ హీరోల నుంచి సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ అలర్ట్ అయిపోతారు. రికార్డుల వేట కూడా మొదలైపోతుంది. అయితే ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడేలా ఉంది. అదేంటంటే ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద సమరానికి సై అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అసలు ఈ చిక్కులు ఎక్కడ మొదలయ్యాయంటే.. దేవర సినిమా వాయిదా పడబోతోంది అంటూ వార్తలు రావడంతో స్టార్ట్ అయ్యాయి. దేవర సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. కానీ, ఈ సినిమా వాయిదా పడబోతోంది అంటూ ఇప్పుడు టాలీవుడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. షూటింగ్ పూర్తి కాకపోవడం, గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటం, సైఫ్ అలీఖాన్ పార్ట్ కూడా ఇంకా చిత్రీకరణ జరగలేదు అంటూ చాలానే కారణాలు చెబుతున్నారు. అందుకే దేవర సినిమాని వాయిదా వేస్తున్నట్లు చాలానే వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ వాయిదా పడటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, కొత్త విడుదల తేదీ విషయంలోనే అసలు తంటాలు వచ్చి పడుతున్నాయి.

అసలు విషయం ఏంటంటే.. దేవర సినిమాని ఆగస్టు 15న విడుదల చేసేందుకు సమాలోచనలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇక్కడే అసలు ఇబ్బంది మొదలైంది. ఆ డేట్ కి ఇప్పటికే పుష్ప ది రూల్ సినిమా విడుదల చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేసి ఉన్నారు. పుష్ప సీక్వెల్ మీద దేశవ్యాప్తంగా ఉన్న బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ఎప్పుడెప్పుడు వస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఇదే డేట్ కి గనుక దేవర కూడా వస్తే బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరిగే ఛాన్స్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు నువ్వా నేనా అంటూ కొత్త వార్ కి తెర తీసినట్లు అవుతుంది. అయితే ఈ వార్ జరిగే ఛాన్స్ అయితే ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రిలీజ్ డేట్ విషయంలో రెండు సినిమాల మేకర్స్ మార్కెట్ ని లాస్ చేసుకోవడానికి ఇష్టపడరు అనే అంటున్నారు. అందుకే దేవర మరో డేట్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? లేదంటే పుష్పతో ఢీ అంటే ఢీ అంటారా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు పుష్ప 2 సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ కూడా పూకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ పుష్ప 2 వాయిదా పడితే దేవరకు లైన్ క్లియర్ అవుతుంది. అయితే ఇప్పుడు దేవర పోస్ట్ పోన్ కావడం రౌడీ హీరోకి బాగా కలిసొచ్చింది. దేవర డేట్ కి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సీక్వెల్ టిల్లూ స్క్వేర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి.. దేవర vs పుష్ప యుద్ధం జరుగుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet