iDreamPost
android-app
ios-app

USA మార్కెట్లో కాసుల వర్షం కురిపిస్తున్న దేవర! తాజా వసూళ్లు ఇవే!

  • Published Oct 02, 2024 | 3:10 PM Updated Updated Oct 02, 2024 | 3:10 PM

Devara Movie: దేవర బాక్స్ ఆఫీస్ ని కుమ్మేస్తుంది. వసూళ్లతో అదరగొడుతుంది. వర్కింగ్ డేస్‌లో కూడా అద్భుతంగా ఆడుతుంది.

Devara Movie: దేవర బాక్స్ ఆఫీస్ ని కుమ్మేస్తుంది. వసూళ్లతో అదరగొడుతుంది. వర్కింగ్ డేస్‌లో కూడా అద్భుతంగా ఆడుతుంది.

USA మార్కెట్లో కాసుల వర్షం కురిపిస్తున్న దేవర! తాజా వసూళ్లు ఇవే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషనల్లో వచ్చిన ‘దేవర’ బాక్స్ ఆఫీస్ ని కుమ్మేస్తుంది. భారీ వసూళ్లతో అదరగొడుతుంది. వర్కింగ్ డేస్‌లో కూడా అల్లాడిస్తుంది. అద్భుతంగా ఆడుతుంది. మొదట మిక్స్డ్ రెస్పాన్స్‌ దక్కించుకున్న ఈ సినిమా రెండో రోజుతో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. అందువల్ల థియేటర్లు హౌస్ ఫుల్స్ తో నిండిపోతున్నాయి. అద్భుతమైన కలెక్షన్స్‌తో ఈ సినిమా సర్వత్రా సందడి చేస్తోంది. అన్ని ఏరియాల్లో కాసుల వర్షం కురిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ దేవరలో పుష్కలంగా ఉన్నాయి. దాంతో రిపీటెడ్ గా ఈ సినిమాని చూస్తున్నారు.

ఫలితంగా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ గ్రోత్ అందుకుంటుంది దేవర. మంచి హోల్డ్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది. నేడు అక్టోబర్ 2 గాంధీ జయంతి హాలిడే కావడంతో సినిమాకు ఇంకా వసూళ్లు పెరగడం పక్కా. ఇలా విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల సునామి సృష్టిస్తున్నాడు దేవర. ఇప్పటికే మార్నింగ్ షోల టికెట్ సేల్స్ లో సూపర్ గ్రోత్ కనిపిస్తూ ఉంది. ఇదే గ్రోత్ మ్యాట్నీ, ఈవినింగ్ షోల దాకా ఎక్స్ లెంట్ గా కొనసాగే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో ఈ సినిమా కచ్చితంగా లాభాలని పొందే అవకాశం ఉందని అంటున్నారు.ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన దేవర ఈ వీక్ లో కూడా రచ్చ చేసే అవకాశం ఉంది. ఇక దసరా సెలవుల అడ్వాంటేజ్ తో ఈ సినిమా కచ్చితంగా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటుంది. ఇంకా ఈ సినిమా ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే దేవర చిత్రం ఓవర్సీస్‌లో కుమ్మేస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా యూఎస్ మార్కెట్లో ఏకంగా 5.3 మిలియన్ డాలర్ల పైగా వసూలు చేసింది. అంటే సుమారుగా 46 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇప్పటికీ కూడా నిలకడగా వసూళ్ళని రాబడుతుంది. ఈ వసూళ్లు ఇంకా పెరిగే ఆరేళ్ల నుంచి యంగ్ టైగర్ సినిమా కోసం ఆత్రంగా ఎదురు చూసారు అభిమానులు. దాంతో ఎన్టీఆర్ కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ ని అందించారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం వన్ ఆఫ్ ది మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచింది. పాటలు అదిరిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే చితక్కొట్టేసాడు. రత్నవేలు సినిమాటోగ్రఫి అయితే అభిమానులకి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. చూడాలి దేవర ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో.. ఇక దేవర USA వసూళ్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.