iDreamPost
android-app
ios-app

Devara: కళ్లు చెదిరిపోయే ధరకు దేవర తెలుగు రైట్స్..!

  • Published Apr 16, 2024 | 12:55 PM Updated Updated Apr 16, 2024 | 12:55 PM

Devara Movie..జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం.. దసరా పండుగ సమయంలో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో..

Devara Movie..జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం.. దసరా పండుగ సమయంలో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో..

  • Published Apr 16, 2024 | 12:55 PMUpdated Apr 16, 2024 | 12:55 PM
Devara: కళ్లు చెదిరిపోయే ధరకు దేవర తెలుగు రైట్స్..!

మాన్ ఆఫ్ ద మ్యాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న సినిమా దేవర. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కుతోన్న దేవర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే.. ఆ పాటికి థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది. కానీ సైఫ్ అలీఖాన్‌కు గాయాలు, వీఎఫ్ఎక్స్ ఆలస్యం వెరసి సినిమా కాస్త వాయిదా పడింది. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవర.. అక్టోబర్ 10కి జరిగింది. ఇది తారక్ ఫ్యాన్స్‌ను కాస్త హర్ట్ చేసింది. ఇప్పటికే తమ బాస్‌ను తెరపై చూసుకుని రెండేళ్లు గడిచిపోతుంది. నందమూరి వారసుడి రాక కోసం విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. వారి కోసమే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

దేవర తెలుగులో కాకుండా హిందీలో కూడా గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధం చేస్తున్నారు. అక్కడ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిల్మింస్ భారీ ప్లాన్ చేసింది. అయితే తెలుగులో కూడా భారీ నిర్మాణ సంస్థ తెలుగు థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దేవర సినిమా హక్కుల కోసం మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్ టైన్‌మెంట్, దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) పోటీ పడుతున్నాయని సమాచారం. ఇరు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం ఈ మూడు సంస్థలు పోటీ పడుతున్నాయట. సుమారు రూ. 130 కోట్ల మేరకు కోట్ చేస్తున్నారట నిర్మాతలు. అంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందట సితార ఎంటర్ టైన్ మెంట్.

Devara Telugu rights at record rate

ఒకటి రెండు రోజుల్లో ఈ డీల్ నిర్మాత నాగవంశీ క్లోజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం..రిలీజ్ కాకముందే రికార్డులు బద్దలు కొడుతోంది దేవర. ఇంత రేటు పెట్టడం వెనుక కూడా కారణం లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో తారక్ రేంజ్ పెరిగింది. మార్కెట్ లో అతడి క్రేజ్ దృష్ట్యా భారీ మొత్తానికి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ వార్ 2 కోసం ముంబయిలో ఉన్న సంగతి విదితమే. దేవర మూవీ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటోంది. అనిరుధ్ రవిచంద్రన్ బాణీలు సమకూరుస్తున్నాడు. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా..ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకున్న సంగతి విదితమే. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet