iDreamPost
android-app
ios-app

నార్త్‌లో దేవర క్రేజ్! తారక్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయే న్యూస్!

  • Published Apr 10, 2024 | 5:05 PM Updated Updated Apr 10, 2024 | 5:11 PM

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రెజ్టిసియస్ ప్రాజెక్ట్ దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చింది.

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రెజ్టిసియస్ ప్రాజెక్ట్ దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చింది.

  • Published Apr 10, 2024 | 5:05 PMUpdated Apr 10, 2024 | 5:11 PM
నార్త్‌లో దేవర క్రేజ్! తారక్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయే న్యూస్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను తెరపై అభిమానులు చూసుకుని రెండేళ్లు పూర్తై పోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈవెంట్లలోనే లేదా బయట ఎక్కడో కనబడితే కటౌట్‌ను చూసుకుని మురిసిపోతున్నారు డై హార్ట్ ఫ్యాన్స్. అన్ని అనుకున్నట్లే జరిగి ఉంటే.. దేవర మూవీ ఈ ఏప్రిల్ 5న విడుదలై సంబరాలు చేసుకునేవారు..ప్చ్ కానీ పోస్టుపోన్ అయ్యింది. దేవర రిలీజ్ ఏప్రిల్ నుండి అక్టోబర్‌కు వెళ్లిపోయింది. దీంతో మరింత నిరాశలో కూరుకుపోయాడు ఫ్యాన్స్. అయితే వారిని పూనకాలు తెప్పించే ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ఎదిగిన తారక్.. ఇప్పుడు అచ్చంగా నార్త్ ఇండియా బాక్సాఫీసు మీద కన్నేశాడు.

నార్త్ ఇండియాలో దేవర హక్కులను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని కరణ్ జోహర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఒక మాస్ తుఫాన్ మనందర్ని ముంచేయడానికి త్వరలోనే రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీర్ దేవరలో భాగం అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ భాగస్వామ్యం పట్ల గర్వంగా ఉంది’ అంటూ ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశాడు కరణ్. కరన్ జోహార్‌ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ పాటు ఏఏ ఫిలిమ్స్ సంయుక్తంగా రిలీజ్ చేయబోతున్నాయి. మొత్తానికి దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా తన హవా చాటేందుకు సిద్ధం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్.

తారక్, కొరటాల శివ కాంబోలో రూపుదిద్దుకుంటున్న రెండో చిత్రం దేవర. జనతా గ్యారేజీతో మాస్ అండ్ క్లాసీ హిట్ అందుకున్న ఈ ఇద్దరు కలిసి నయా ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయగానే.. గూస్ బంప్స్ వచ్చాయి నందమూరి అభిమానులకు. ఆపై రిలీజైన పోస్టర్ అంచనాలు పెంచేసింది. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ.. మన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుందని తెలిసే సరికి.. ఇదొక క్రేజీ కాంబో అయ్యింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. రమ్యకృష్ణ, షైన్ టామ్ చారో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ. 120 కోట్ల బడ్జెట్‌తో యంగ్ టైగర్ కెరీర్‌లో అత్యంత బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుంది. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇది పూర్తైన వెంటనే.. బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్‌లో కూడా పాల్గొనున్నాడు తారక్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet