iDreamPost
android-app
ios-app

Devara: దేవర టీజర్ పై లీకులు.. సినీ హిస్టరీలో టాప్ విజువల్స్ తో!

జూనియర్‌ ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ విజువల్‌ వండర్‌గా ఉండనుందన్న టాక్‌ బాగా నడుస్తోంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ విజువల్‌ వండర్‌గా ఉండనుందన్న టాక్‌ బాగా నడుస్తోంది.

Devara: దేవర టీజర్ పై లీకులు.. సినీ హిస్టరీలో టాప్ విజువల్స్ తో!

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న దేవర సినిమా మొదటి భాగం షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. దీంతో చిత్ర బృందం తాజాగా కొత్త సంవత్సరం పోస్టర్ ను విడుదల చేసింది. ఇప్పుడు గ్లిమ్స్‌ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గ్లిమ్స్‌కు సంబంధించిన లీక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్‌ఆర్‌’ తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో దేవర పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రలో అద్భుతమైన నటనను కనబర్చడం ద్వారా పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ దక్కించుకోవడమే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమాను చేస్తున్నాడంటే అంతకు మించి అన్నట్లుగా అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా కొత్త సంవత్సరం కానుకగా వచ్చిన దేవర పోస్టర్‌ ఫ్యాన్స్ ని పూర్తిగా సంతృప్తి పరచలేదు అనేది సోషల్‌ మీడియా టాక్‌. పోస్టర్ ఏమో కానీ… మరో అయిదు రోజుల్లో రాబోతున్న గ్లిమ్స్ తో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం అంటున్నారు.

జనవరి 8వ తారీకున రాబోతున్న దేవర టీజర్‌/గ్లిమ్స్ లో విజువల్స్ హాలీవుడ్‌ స్టాండర్డ్‌ లో ఉంటాయి అన్నట్లుగా సమాచారం అందుతోంది. గ్లిమ్స్ కు సంబంధించిన లీక్స్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే కొందరు గ్లిమ్స్ ను చూశారట. అందులో చూపించబోతున్న షాట్స్ మరియు ఎన్టీఆర్‌ లుక్‌ మెస్మరైజింగ్‌ గా ఉండబోతుందని చూసిన వారు అంటున్నారు. సినిమా చాలా గ్రాండ్‌ గా, భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెల్సిందే. అందుకు తగ్గట్లుగా పోస్టర్‌ లేదు కానీ, గ్లిమ్స్ లో అసలైన దేవర సినిమాను చూస్తారని లీక్స్‌ వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఇలాంటి విజువల్స్ ఇప్పటి వరకు చూసి ఉండరు అంటూ చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు.

దర్శకుడు కొరటాల శివ చేసే గ్రాఫిక్ మాయాజాలంతో దేవర సినిమా మరో లెవల్‌ కి ప్రేక్షకులను తీసుకు వెళ్తుందని కూడా చాలా మంది నమ్మకం గా మాట్లాడుతున్నారు. గ్లిమ్స్ లో కళ్లు చెదిరే విజువల్స్ ఉంటాయని, ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు చూడని విజువల్స్ చూస్తారని లీక్‌ అందుతుంది. టాప్ లెవల్‌ గ్రాఫిక్స్ తో దేవరను కొరటాల శివ రూపొందిస్తున్నాడట. ఇప్పటి వరకు వచ్చిన అద్భుతమైన గ్రాఫిక్స్ మూవీ ల జాబితాలో దేవర చేరడం ఖాయం అంటున్నారు.

మొత్తానికి దేవర సినిమా గ్లిమ్స్ విడుదల అయిన తర్వాత సినిమా స్థాయి అమాంతం పెరగడం మాత్రమే కాకుండా సినిమా యొక్క అంచనాలు, మార్కెట్‌ వ్యాల్యూ రెండింతలు, మూడింతలు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ లో సమ్మర్ కానుకగా విడుదల అవ్వబోతున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. దేవర రెండు పార్ట్‌ లుగా విడుదల అవ్వబోతుంది. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ ఈ సినిమాలో విలన్‌గా కనిపించబోతున్న నేపథ్యం లో పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు మరింత పెరిగాయి. దేవర సినిమా ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? గ్లిమ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişjojobet giriş