iDreamPost
android-app
ios-app

SKN కష్టాలు చెబుతూ బన్నీ ఎమోషనల్.. ఇప్పటికి గుర్తింపు వచ్చింది!

SKN కష్టాలు చెబుతూ బన్నీ ఎమోషనల్.. ఇప్పటికి గుర్తింపు వచ్చింది!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక ప్రొడ్యూసర్ పేరు బాగా వినిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆయన స్పీచులు, ఆయన యాక్షన్స్, ఆయన సినిమాల గురించే టాక్ నడుస్తోంది. అది మరెవరో కాదు.. బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. ఈయన సినిమాలతోనే కాకుండా.. ఆయన చెప్పే స్పీచులతో కూడా బాగా వైరల్ అవుతూ ఉంటారు. ఇటీవల మాట్లాడుతూ మధ్యలో మైక్ విసిరిన సీన్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ నవ్విస్తుండే ఎస్కేఎన్ ఈసారి అందరినీ ఏడిపించేశారు. తన స్పీచుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా కంటతడి పెట్టించారు.

బేబీ సినిమా టీమ్ ని విష్ చేసేందుకు బన్నీ స్పెషల్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేశాడు. అందులో రెండు ఇట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి. అవేంటంటే.. అసలు ఎస్కేఎన్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? బన్నీ- ఎస్కేఎన్ రిలేషన్ ఎలాంటిది? ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఎస్కేఎన్ జర్నీ గురించి స్వయంగా అల్లు అర్జున్ స్టేజ్ మీద అందరికీ చెప్పుకొచ్చాడు. కట్టె కాలే వరకు నేను చిరంజీవి అభిమానినే అంటూ.. ఎస్కేఎన్ గురించి మాట్లాడారు. “ఇంకా అప్పటికి నేను పూర్తిగా సినిమాల్లోకి రాలేదు. ఓసారి అందరి ఫ్యాన్స్ మనల్ని తిడుతుంటే ఒక్కడు మాత్రం వాళ్లకి సింగిల్ హ్యాండెడ్ గా రిప్లైలు పెడుతున్నాడు. రాత్రి మూడింటికి పెట్టినా.. తెల్లారి ఏడింటికి పెట్టినా.. 11 గంటలకు పెట్టినా రిప్లై ఇస్తున్నాడు.

ఎవడో చిరంజీవి గారి హార్డ్ కోర్ ఫ్యాన్ లా ఉన్నాడు అంటూ శిరీష్ చెప్పాడు. అలాంటి వాడు అక్కడ కాదు.. హైదరాబాద్ లో ఉండాలి తీసుకురా అని చెప్పాను. కానీ, అప్పుడు మాకే సరిగ్గా సపోర్ట్ లేదు. మా దగ్గర డబ్బు కూడా లేదు. కానీ, వచ్చేయమని చెప్పాం. తీరా వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి అనే ప్రశ్న వచ్చింది. మేము డాన్స్ ప్రాక్టీస్ చేసే షెడ్ పక్కన చిన్న రూమ్ ఉంటే అక్కడ ఉండమని చెప్పాం. చాలా చిన్న రూమ్ అది.. కనీసం బాత్ రూమ్ కూడా లేదు. అలాంటి సింగిల్ రూమ్ లో ఎన్నో ఏళ్లు ఉన్నాడు. తనకు జర్నలిజం అంటే ఇంట్రస్ట్ అని టీవీ9లో జర్నలిస్ట్ గా చేరాడు. ఆ తర్వాత చిన్నగా పీఆర్ అయ్యాడు.

ఎన్నోఏళ్లు పీఆర్ గా చేశాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా సినిమా తీశాడు. మైక్ ఇసరటం, మీములు చేయడం చూసి మీరంతా ఎస్కేఎన్ ఓవర్ చేస్తున్నాడు అనుకుంటారు. కానీ, తన జర్నీ చాలా దగ్గరగా చూశాను నేను. నిజానికి వాడు ఏం చేసినా నాకు ఎక్కువ చేసినట్లు అనిపించదు. ప్రతి మనిషికి డబ్బుకన్నా ముఖ్యంగా కావాల్సింది గుర్తింపు. ఎస్కేఎన్ కు అది దక్కింది” అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. బన్నీ గురించి కూడా ఎస్కేఎన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తనకు లైఫ్ ఇచ్చింది అల్లు అర్జున్ అంటూ చెప్పుకొచ్చారు. జర్నలిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత అల్లు అర్జున్ తనకు పీఆర్ మొదటి అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.

లైఫ్ లో తనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. అల్లు అర్జున్ అండగా నిలబడినట్లు చెప్పారు. ఆ తర్వాత వరుసగా రామ్ చరణ్, పవన్ కల్యాణ్, రవితేజ, ప్రభాస్ లు ఎస్కేఎన్ కి పీఆర్ గా అవకాశం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. బేబీ సినిమా కోసం ఎంత కష్టపడింది ఎస్కేన్ వెల్లడించారు. ఈ సినిమా కోసం అల్లు అరవింద్ దగ్గర అప్పు చేశారంట. అంతేకాకుండా కొత్త ఫ్లాట్.. నెలలో గృహప్రవేశం అనగా అమ్మెసినట్లు చెప్పారు. ఇంట్లో వాళ్లని ఈ ఒక్క అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ సినిమా హిట్ అయితే మై హోమ్ లో ఇల్లు కొంటానని హామీ ఇచ్చారంట. నిజానికి ఇప్పటివరకు ఎస్కేఎన్ తీసిన సినిమాలు అన్నీ కల్ట్ హిట్లే. ఆయన తీసుకొచ్చిన హీరోలు, హీరోయిన్స్ అంతా ఇండస్ట్రీలో మంచి కెరీర్ పొందారు. ఇప్పుడు బేబీ సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రిలైజన్ మొదటి వారంలోనే రూ.50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio