iDreamPost

Video: తన ముందు హీరోయిన్ ప్రత్యక్షం.. డెలివరీ బాయ్ చేసిన పనికి..

సెలబ్రిటీలు కనిపిస్తే.. చాలు తాము చేస్తున్న పనిని సైతం మానుకుని సైతం వారిని చూసేందుకు ఎగబడుతుంటారు. కానీ తన ముందు స్టార్ హీరోయిన్ ప్రత్యక్షమైనతే ఓ వ్యక్తి చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

సెలబ్రిటీలు కనిపిస్తే.. చాలు తాము చేస్తున్న పనిని సైతం మానుకుని సైతం వారిని చూసేందుకు ఎగబడుతుంటారు. కానీ తన ముందు స్టార్ హీరోయిన్ ప్రత్యక్షమైనతే ఓ వ్యక్తి చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Video: తన ముందు హీరోయిన్ ప్రత్యక్షం.. డెలివరీ బాయ్ చేసిన పనికి..

సాధారణంగా ఎవరైన నటీనటులు కనిపిస్తే..వారిని కలిసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలానే కాస్త ఫేమస్ అయిన వారిని చూసేందుకు ఎగబడుతుంటారు. అలానే స్టార్ హీరో, హీరోయిన్లు కనిపిస్తే మాత్రం సెల్ఫీలు  తీసుకునేందుకు ఎగబడుతుంటారు. సెలబ్రిటీలు కనిపిస్తే.. చాలు తాము చేస్తున్న పనిని సైతం మానుకుని సైతం వారిని చూసేందుకు ఎగబడుతుంటారు. కానీ వ్యక్తి మాత్రం తన ముందు నుంచే స్టార్ హీరోయిన్ వెళ్తున్న కూడా తన పనిలోనే నిమగ్నమయ్యాడు. అతడి వర్క్ డెడికేషన్ కి అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ డెలివరీ బాయ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్టార్‌ హీరోయిన్ పక్కనే వెళ్తున్నా.. అదేమీ పట్టించుకోకుండా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కి చెందిన డెలివరీ బాయ్ తన పనిమీద ముందుకెళ్లాడు. అతడి పనిపై ఉన్న నిబంధతకు నెటిజన్లను ఆశ్చర్యపర్చింది. ఆన్‌లైన్‌లో వైరల్‌ మారిన ఆ వీడియోపై ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ స్పందించింది. ఇక వైరల్ అవుతున్న వీడియోను గమనించినట్లు అయితే.. స్విగ్గీ ఫుడ్  డెలివరీ బాయ్ ఒకరు తనకొచ్చిన ఆర్డర్ నిమిత్తం ఒక బిల్డింగ్ లోకి వెళ్తున్నాడు. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు అతడిని కాస్తా పక్కకు జరగమని చెప్తున్నారు.

వారెందుకు జరగమంటున్నారో సదరు యువకుడి అర్ధం కాలేదు. కాసేపు అయోమయానికి గురయ్యాడు. తర్వాత అదేమీ పట్టించుకోకుండా తాను డెలివరీ చేయాల్సిన ఆర్డర్ విషయంలో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో స్టార్ హీరోయిన్ తాప్సి ఆ భవనం నుంచి బయటకు వస్తున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్ లో కళ్లజోడు పెట్టుకుని అలా బయటకు వచ్చింది. ఆమె తలవంచుకొని కారువైపు వెళ్తున్నారు. తనకు హీరోయిన్ తాప్సి ఎదురెదురుగా వస్తున్నా ఆ డెలివరీ బాయ్ మాత్రం ఏమాత్రం ఎగ్జైట్ కాలేదు. అసలు ఆమె ఎవరో తెలియదు అన్నట్లుగా సైలెంట్ గా  తాప్సి పక్క నుంచి లోపలికి వెళ్లిపోయాడు.

ఈ ఘటన అక్కడే ఉన్న కెమెరాల్లో బంధి అయ్యాయి. అవి చివరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఈ ఘటనపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. అతడు వృతి పట్ల చూపిన నిబద్ధతకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని పలువురు నెటిజన్లు స్విగ్గీని ట్యాగ్ చేశారు. దానిపై స్విగ్గీ సంస్థ యాప్ స్పందించింది. ఏమీ పట్టించుకోకుండా.. సంతోషంగా.. తన దారిలో తానుపోతూ..పనిపై దృష్టిపెట్టాడంటూ వ్యాఖ్యను జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ డెలివరీ బాయ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి