iDreamPost
android-app
ios-app

కల్కి 2 నుంచి అవుట్ కానీ కింగ్ లోకి ఎంట్రీ

  • Published Sep 20, 2025 | 3:28 PM Updated Updated Sep 20, 2025 | 3:28 PM

రెండు మూడు రోజుల నుంచి దీపికా గురించి సోషల్ మీడియాలో ఏవో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘కల్కి’తో పోలిస్తే తన పారితోషకంలో 25 శాతం హైక్ అడిగిందని.. రోజుకు 7 గంటలే పని చేస్తానని కండిషన్స్ పెట్టిందని.. తన స్టాఫ్ 25 మందికి వసతి సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసిందని.. అందుకే కల్కి నుంచి ఆమెను తప్పించారని..

రెండు మూడు రోజుల నుంచి దీపికా గురించి సోషల్ మీడియాలో ఏవో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘కల్కి’తో పోలిస్తే తన పారితోషకంలో 25 శాతం హైక్ అడిగిందని.. రోజుకు 7 గంటలే పని చేస్తానని కండిషన్స్ పెట్టిందని.. తన స్టాఫ్ 25 మందికి వసతి సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసిందని.. అందుకే కల్కి నుంచి ఆమెను తప్పించారని..

  • Published Sep 20, 2025 | 3:28 PMUpdated Sep 20, 2025 | 3:28 PM
కల్కి 2 నుంచి అవుట్ కానీ కింగ్ లోకి ఎంట్రీ

రెండు మూడు రోజుల నుంచి దీపికా గురించి సోషల్ మీడియాలో ఏవో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘కల్కి’తో పోలిస్తే తన పారితోషకంలో 25 శాతం హైక్ అడిగిందని.. రోజుకు 7 గంటలే పని చేస్తానని కండిషన్స్ పెట్టిందని.. తన స్టాఫ్ 25 మందికి వసతి సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసిందని.. అందుకే కల్కి నుంచి ఆమెను తప్పించారని.. ఏదేమైనా సందీప్ చెప్పింది నిజమే అని ఇలా సోషక్ మీడియా దీపికా గురించి కోడై కూస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా దీపికా మాత్రం దీని గురించి స్పందించలేదు. అసలు ఏమి పట్టనట్టే ఉంది.

దీనితో దీపికా నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా దీపికా ఓ పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో ఆమె తన కొత్త సినిమా చేయబోతుందట. అదే ‘కింగ్’.. ‘పఠాన్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు .దీని గురించి ఆమె షేర్ చేసుకున్నారు.. “‘‘18 ఏళ్ల కిందట షారుఖ్‌తో ఓం శాంతి ఓం చేసినపుడు ఆయన్నుంచి ఒక పాఠం నేర్చుకున్నా. సినిమా మేకింగ్‌ను ఆస్వాదించు, సక్సెస్ కంటే సినిమా ద్వారా కలిసే వ్యక్తులే ముఖ్యం. దీన్ని నేను ఎప్పుడూ అంగీకరిస్తా. అందుకే షారుఖ్‌తో నా ఆరో సినిమా చేస్తున్నా’’ అని దీపిక చెప్పుకొచ్చింది.

అసలు సోషల్ మీడియాలో కల్కి 2 లో ఆమె పాత్ర గురించి ఇంత జరుగుతున్నా.. దాని గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఇంకో సినిమా గురించి పోస్ట్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఎంత చూసిన అందులో కల్కి 2 కి సంబంధించి మాత్రం ఎలాంటి ప్రస్తావన లేదు. దీనితో ఇప్పుడు దీపికా పోస్ట్ గురించి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక ముందైనా దీపికా ఏమైనా స్పదిస్తుందేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.