iDreamPost
android-app
ios-app

అత్యధిక టాక్స్ కట్టే హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఆస్తి తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • Author Soma Sekhar Published - 10:01 PM, Mon - 17 July 23
  • Author Soma Sekhar Published - 10:01 PM, Mon - 17 July 23
అత్యధిక టాక్స్ కట్టే హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఆస్తి తెలిస్తే షాకవ్వాల్సిందే!

భారతదేశంలో అత్యధిక టాక్స్ కట్టే హీరోయిన్ ఎవరో మీకు తెలుసా? అదీకాక ఆమె ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. మనం షాకవ్వాల్సిందే. ఇక 2019లో అత్యధిక నికర సంపద కలిగిన టాప్-10 సెలబ్రిటీల జాబితాలో చోటు కూడా సంపాదించుకుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఆ సంవత్సరం ఆమె అజయ్ దేవ్ గన్, రజనీకాంత్, రోహిత్ శర్మలకు కూడా అధిగమించింది. ఈ ముద్దుగుమ్మకు సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్, ఇతర రంగాల నుంచి కూడా ఆదాయం వస్తోంది. దాంతో దేశంలోనే ఎక్కువ పన్ను కంటే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియా వైడ్ గా ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. ఇక వారు తీసుకునే రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమాలతో పాటుగా యాడ్స్, ఎండోర్స్ మెంట్స్ ద్వారా ఈ తారలు భారీగానే అర్జిస్తున్నారు. కాగా.. భారతదేశంలో ఎక్కువ పన్ను కట్టే హీరోయిన్ బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొణె. ఇండియాలో, మహిళా సెలబ్రిటీల్లో టాప్ టాక్స్ పేయర్ గా ఉంది ఈ భామ. ఇక ఆమె ఆస్తి విలువ అక్షరాలా రూ.500 కోట్లకు పైనే ఉంటుందట. ఇక టాక్స్ కు సంబంధించి 2016-17 సమయంలోనే దీపికా సుమారు రూ.10 కోట్ల వరకు పన్ను కట్టిందట. తర్వాత కూడా ఇదే విధంగా చెల్లిస్తూ వస్తుందని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. గతేడాది కూడా మహిళా సెలబ్రిటీల లిస్ట్ లో దీపిక ఒక్కరే ఉండటం గమనార్హం.

కాగా.. దీపిక సంవత్సరానికి సుమారు రూ.50 కోట్ల వరకు అర్జిస్తుందని తెలుస్తోంది. ఇక దీపిక తర్వాత పన్ను కట్టే సెలబ్రిటీల్లో అలియా భట్ సంవత్సరానికి రూ.5-6 కోట్ల వరకు ట్యాక్స్ కడుతుందట. ఆ తర్వాత కత్రినా కైఫ్ ఈ జాబితాలో ఉంది. ఇక నికర సంపద విషయానికి వస్తే.. దీపిక పదుకొణెను అధిగమించింది గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా. ఆమె నికర సంపద రూ.620 కోట్లు ఉంటుందట. ఈ లిస్ట్ లో దీపిక సెకండ్ ప్లేస్ లో ఉంటే.. బేబో కరీనా కపూర్ రూ. 485 కోట్లతో మూడో స్థానంలో ఉంది. టాలీవుడ్ తారలు ఇంకా ఈ స్థాయికి చేరుకోలేదనే చెప్పాలి.

ఇదికూడా చదవండి: మరీ తెల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారు! మంచు విష్ణు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss