Krishna Kowshik
టాలీవుడ్ క్యూట్ స్క్రీన్ కపుల్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్. ఇందులో డియర్ కామ్రేడ్ తనకు బాగా నచ్చిన చిత్రం అని రష్మిక వెల్లడించింది. కాాగా, ఇందులో రష్మికకు అక్కగా నటించిన యాక్ట్రెస్ గుర్తుందా..?
టాలీవుడ్ క్యూట్ స్క్రీన్ కపుల్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్. ఇందులో డియర్ కామ్రేడ్ తనకు బాగా నచ్చిన చిత్రం అని రష్మిక వెల్లడించింది. కాాగా, ఇందులో రష్మికకు అక్కగా నటించిన యాక్ట్రెస్ గుర్తుందా..?
Krishna Kowshik
బిగ్ స్క్రీన్‌పై బెస్ట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. గీతా గోవిందంతో మ్యాజిక్ చేసిన ఈ కపుల్.. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్‌లో కూడా ఆకట్టుకున్నారు. సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోనప్పటికీ.. తన మనస్సుకు నచ్చిన చిత్రంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ నేషనల్ క్రష్. లిల్లీ పాత్రలో ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. క్రికెట్ రంగంలో ముఖ్యంగా మహిళా క్రికెట్‌లో యువతులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, రాజకీయ కోణం ఎలా ఉంటుందో తెలియజేసిన సినిమా ఇది. డియర్ కామ్రేడ్ ఓ సందేశాన్ని ఇస్తుంది. ఇందులో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య సాగే ప్రేమ,స్ట్రగుల్స్ చూపించాడు భరత్ కమ్మ. అలాగే ఫ్యామిలీ ఎటాచ్ మెంట్స్ కనిపిస్తాయి. ఇందులో రష్మికకు అక్కగా నటించిన యాక్ట్రెస్ గుర్తుందా?
విజయ్ కాలేజీ డేస్‌లో ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాయగా.. ఆమె బుద్దిగా చదువుకోమని చెబుతుంది. రష్మిక అక్క జయ పాత్రలో కనిపించిన ఆ నటి ఎవరంటే శృతి రామచంద్రన్. ఈమె మలయాళ నటి. చెన్నైలో పుట్టిన ఆమె.. ఫ్యామిలీ కేరళకు షిఫ్ట్ అయ్యింది. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కొచ్చిలోనే సాగింది. మైసూర్‌లో ఆర్టిటెక్చర్ విద్యను అభ్యసించింది. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన న్జాన్ మూవీతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరో జయసూర్య ప్రేతమ్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించింది. ఇందులో రష్మికకు కజిన్‌గా కనిపిస్తుంది.
కెరీర్ స్టార్టింగ్‌లోనే తన బాయ్ ఫ్రెండ్ ఫ్రాన్సిస్ థామస్‌ను వివాహం చేసుకుంది. శృతి రామచంద్రన్ సోదరి కూడా నటే. ఈ మధ్య ఓ పాన్ ఇండియన్ తెలుగు చిత్రంతో అదరగొట్టింది. కల్కి 2898ఏడీలో రెబల్ గ్యాంగ్ అమ్మాయిగా, కాంప్లెక్స్‌లో వర్క్ చేసే లిల్లీ పాత్రను కావ్య రామచంద్రన్ ఈమె చెల్లెలే. శృతి కేవలం నటి మాత్రమే కాదు.. డబ్బింగ్ రైటర్. రచయిత కూడా. తమిళంలో ఇలమై ఇదో ఇధోకు సహ రచయితగా వర్క్ చేసింది. ఇటు మలయాళంలో, తెలుగులోనే కాదు తమిళంలోనూ చిత్రాలు చేస్తూ దూసుకెళుతుంది. ఈ ఏడాది గుర్ర్, నందన సంభవం, మరవిల్లన్ గోపురాంగల్ చిత్రాలతో పలకరించింది. ఇవే కాకుండా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది శృతి రామచంద్రన్.