iDreamPost

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ దర్శన్.. నికిత నుండి పవిత్ర గౌడ వరకు

ప్రియురాలికి అసభ్యకరమైన మేసెజెస్ పంపిస్తున్నాడన్న కారణంతో ఓ వీరాభిమానిని హత్య చేశాడు ప్రముఖ శాండిల్ వుడ్ హీరో దర్శన్. అరెస్టై జైలు పాలయ్యాడు. అయితే అతడు వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు

ప్రియురాలికి అసభ్యకరమైన మేసెజెస్ పంపిస్తున్నాడన్న కారణంతో ఓ వీరాభిమానిని హత్య చేశాడు ప్రముఖ శాండిల్ వుడ్ హీరో దర్శన్. అరెస్టై జైలు పాలయ్యాడు. అయితే అతడు వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ దర్శన్.. నికిత నుండి  పవిత్ర గౌడ వరకు

అభిమానిని హత్య చేసిన కేసులో కన్నడ టాప్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, అతడి ప్రియురాలు, నటి పవిత్ర గౌడను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. చిత్రదుర్గ దర్శన్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన రేణుకా స్వామి ఈ నెల 1న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. జూన్ 9న కామాక్షి పాళ్యం సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ పక్కన ఉన్న కాలువలో మృతదేహం కనిపించింది. శవాన్ని కుక్కలు పీక్కుతింటుండగా అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడ్ని రేణుకా స్వామిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా..నిందితులు నటుడు దర్శన్ పేరు చెప్పడంతో అతడ్ని అరెస్టు చేశారు.

కాగా, దర్శన్‌కు వీరాభిమాని అయిన రేణుకా స్వామి.. ప్రియురాలితో హీరో ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు. దర్శన్ తన భార్య విజయలక్ష్మీని కాదని మరొకరితో గడపడాన్ని సహించలేక.. పవిత్ర గౌడకు అసభ్యకర మేసేజెలు పంపాడు. ఈ విషయం స్టార్ హీరోకు తెలిసి..విలన్ అయ్యాడు. అతడిని చంపేసేందుకు సుపారీ ఇచ్చాడు. స్వామి నుండి చిత్ర దుర్గ నుండి బెంగళూరు తీసుకు వచ్చి.. వినయ్ అనే వ్యక్తి షెడ్డులో ఉంచారు. అక్కడ నలుగురు కలిసి కొట్టడంతో మరణించాడు. ఆ సమయంలో దర్శన్ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేయగా.. దర్శన్ సూచనల మేరకే హత్య చేసినట్లు చెప్పడంతో అతడ్ని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. కాగా, దర్శన్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు.

గతంలో టాలీవుడ్ హీరోయిన్ నికితతో రిలేషన్ మెయిన్ టైన్ చేశాడన్న రూమర్లు ఉన్నాయి. ఈ విషయం అతడి భార్యకు తెలిసి.. నికితకు వార్నింగ్ ఇవ్వడంతో ఆమె కెరీర్ ఖతమ్ అయ్యిందంటారు. ఆ తర్వాత ఇతడి లైఫ్‌లోకి వచ్చింది పవిత్ర గౌడ. 2011లో దర్శన్ తనపై గృహ హింసకు పాల్పడ్డాడని భార్య ఆరోపణలు చేయగా.. పోలీసులు అరెస్టు చేసి.. 14 రోజుల కస్టడీ విధించారు. ఆ తర్వాత ఈ ఇష్యూ సెటిల్ చేసుకున్నారిద్దరు. అలాగే 2016లో కూడా దర్శన్ తనపై అభ్యంతరకరంగా వ్యవహరించాడంటూ మరోసారి పోలీసులను ఆశ్రయించింది. 2021లో మైసూర్ హోటల్‌లో వెయిటర్‌పై దర్శన్ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఈ సంఘటనను కప్పిపుచ్చారని, వెయిటర్‌కు రూ. 50,000 ఇచ్చి కవర్ చేశారన్న అపవాదు కూడా ఉంది. అలాగే కన్నడ సినీ నిర్మాత భరత్‌ను దర్శన్ బెదిరించాడు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో ఖాకీలను ఆశ్రయించాడు. జనవరి 2023లో, దర్శన్ పులి పంజా లాకెట్ ధరించడం చూసి..చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంతో దర్శన్ పామ్ హౌస్ పై అటవీ శాఖ అధికారులు దాడి చేశారు. ఇప్పుడు ఓ మత్య కేసులో అరెస్టు అయ్యాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి