iDreamPost
android-app
ios-app

రేణుకాస్వామి మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సెంట్రల్ జైలుకు దర్శన్ తరలింపు..!

  • Published Aug 28, 2024 | 8:57 AM Updated Updated Aug 28, 2024 | 8:57 AM

Renukaswamy Murder Case: తన అభిమానిని కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన నేరంపై కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప్, నటి పవిత్ర గౌడ్ లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్శన్ కి మరో దెబ్బ పడింది.

Renukaswamy Murder Case: తన అభిమానిని కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన నేరంపై కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప్, నటి పవిత్ర గౌడ్ లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్శన్ కి మరో దెబ్బ పడింది.

రేణుకాస్వామి మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సెంట్రల్ జైలుకు దర్శన్ తరలింపు..!

తాను ఎంతగానో అభిమానించి హీరో పన్నిన కుట్రలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు రేణుకా స్వామి అనే వ్యక్తి. తన ప్రియురాలికి అసభ్యకరమైన మెసేజ్ లు, ఇబ్బందిక కామెంట్స్ చేస్తున్నాడన్న కారణంతో రేణుకా స్వామి అనే వ్యక్తిని కిడ్నాప్ చేయించి కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప్, పవిత్ర గౌడ కొంతమంది సుపారీ ఇచ్చి చంపించారు. ఈ నేరం రుజువు కావడంతో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 13 మంది నిందితులను పరప్పన అగ్రహార జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నటుడు దర్శన్ కి మరో షాక్ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

చిత్రదుర్గ నివాసి అయిన రేణుకా స్వామి మర్డర్ కేసులో పవిత్ర గౌడ ఎ1, దర్శన్ తుగదీప్ ఏ2, పవన్ అనే వ్యక్తి ఏ3 గా ఉన్నారు. ఇటీవల రేణుకా స్వామి హత్య కేసులో మరిన్ని కీలక ఆధారలు లభించడంతో దర్శన్ కి మరింత ఉచ్చు బిగుస్తుంది. జైల్లో ఉండి కూడా దర్శన్ తప్పు మీద తప్పు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. రెండు రోజుల క్రితం దర్శన్ బెంగుళూరు బహిరంగ ప్రదేశంలో కొంతమందితో కూర్చొని సిగరెట్, కాఫీ తాగుతూ కనిపించాడు. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అంతేకాదు ఓ వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో కూడా వైరల్ అయ్యింది. దీంతో బెంగుళూరు జైలులో దర్శన్ కి రాచ మర్యాదలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.

బెంగుళూరు జైల్లో దర్శన్ కి వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తుందని.. అతని ఫోటోలు, వీడియో రౌడీ షీటర్ రహస్యంగా సెల్ ఫోన్ లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ ఫోన్ కి పించినట్లు వార్తలు వచ్చాయి. దర్శన్ తో కూర్చొని కలిసి కాఫీ తాగుతున్నవారిలో రౌడీ షటర్ విల్సన్ గార్డన్ నాగ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో అటు జైలు అధికారుల, ఇటు దర్శన్ పై సర్వత్రా విమర్శలు వచ్చాయి.దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దాడులకు చేయడం మొదలు పెట్టడంతో.. సీఎం సిద్ధరామయ్య, హోంమంత్రి జి పరమేశ్వర్ దీనిని సీరియస్ గా తీసుకున్నారు.పరప్పను అగ్రహారం నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బెంగుళూరు లోని 24వ ఏసీఎంఎం కోర్టు మంగళవారం (ఆగస్టు 27) ఉత్తర్వులు జారీ చేసింది. దర్శన్ ని మాత్రమే కాదు.. రేణుకా స్వామి మర్డర్ కేసులో ఉన్న మరికొంతమంది నిందితులను సైతం వేర్వేరు జైళ్లకు తరలించనున్నామని కోర్టు నుంచి ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు.