iDreamPost
android-app
ios-app

రేణుకా స్వామిని హత్య కేసు నిందితుడి ఇంట్లో విషాదం! ఏమైందంటే?

ప్రేయసి పవిత్రగౌడకు అసభ్యకర సందేశాలు పంపినందుకు నటుడు దర్శన్.. రేణుకా స్వామి అనే వ్యక్తిని హత్య చేసిన సంగతి విదితమే. ఈ కేసులో దర్శన్ తో పాటు 17 మంది నిందితులు పరప్పన్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఓ నిందితుడి ఇంట్లో విషాదం నెలకొంది.

ప్రేయసి పవిత్రగౌడకు అసభ్యకర సందేశాలు పంపినందుకు నటుడు దర్శన్.. రేణుకా స్వామి అనే వ్యక్తిని హత్య చేసిన సంగతి విదితమే. ఈ కేసులో దర్శన్ తో పాటు 17 మంది నిందితులు పరప్పన్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఓ నిందితుడి ఇంట్లో విషాదం నెలకొంది.

రేణుకా స్వామిని హత్య కేసు నిందితుడి ఇంట్లో విషాదం! ఏమైందంటే?

ప్రియురాలు పవిత్రగౌడను సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నాడన్న ఆరోపణలపై రేణుకాస్వామి అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు శాండిల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ తూగదీప. ఈ హత్య కేసులో ప్రస్తుతం దర్శన్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడు. కాగా, దర్శన్, పవిత్రగౌడతో పాటు ఇతర నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. చుక్కెదురౌతుంది. వీరి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగించింది. ఇదిలా ఉంటే.. రేణుకా స్వామి హత్య కేసులో నిందితులైన ఒకరి ఇంట్లో విషాదం నెలకొంది. ఏ 4గా పేర్కొనబడిన రఘు తల్లి మరణించింది. రఘు చిత్ర దుర్గ దర్శన్ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

రఘు తల్లి మంజులమ్మ (65) శనివారం మరణించింది. చిత్రదుర్గకు చెందిన కోలి బురుజన హట్టిలోని తన ఇంట్లో మృతి చెందింది. ఓ వైపు అనారోగ్యం, మరో వైపు కొడుకు జైలులో ఉన్నాడన్న ఆవేదనతో ప్రాణాలు విడించింది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం.. కొడుకు ఇలా జైలు పాలు అవుతాడని ఊహించలేదు తల్లి. రఘు ఈ కేసులో అరెస్టైన నాటి నుండి తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది. కుమారుడి గురించి తీవ్రంగా ఆలోచించి, మనస్థాపానికి గురైంది. అంతలో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె తుది శ్వాస విడిచింది. రఘు దర్శన్ చెప్పాడని.. రేణుకా స్వామిని చిత్ర దుర్గ నుండి బెంగళూరుకు తీసుకువచ్చాడు. అనంతరం దర్శన్ టీం అతడ్ని అత్యంత పాశవికంగా కొట్టి చంపిన సంగతి విదితమే. దీంతో ఈ కేసులో అతడ్ని ఏ4 ముద్దాయిగా చేర్చారు పోలీసులు. అతడు కూడా ప్రస్తుతం పరప్పన్ జైలులో ఉన్నాడు.

ఇదిలా ఉంటే రఘు మాత్రమే కాకుండా.. ఇదే కేసులో పట్టుబడిన అనిల్ అనే నిందితుడి తండ్రి కూడా కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. కొడుకు జైలు పాలవ్వడం తట్టుకోలేకపోయిన తండ్రి మానసిక వేదనతో మరణించాడు. రేణుకా స్వామి హత్య కేసులో ఇప్పటి వరకు 17 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిని పరప్పన్ జైలుకు తరలించారు. జులై 18 వరకు జ్యుడిషియల్ విధించగా.. ఇటీవల ఆగస్టు 1 వరకు పొడిగించింది కోర్టు. ఇదిలా ఉంటే..తన ఇంటి నుండి భోజనం తెప్పించుకునేందుకు అనుమతినివ్వాలంటూ దర్శన్ హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఇంటి నుండి భోజనం, పరుపు, దిండు, చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు కోరాడు. కాగా, దీనిపై కోర్టు విచారణ చేపట్టనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి