iDreamPost
android-app
ios-app

కోర్టుకి దర్శన్ స్పెషల్ రిక్వెస్ట్! ఆ సౌకర్యాలు కావాలంటూ పిటిషన్!

Darshan files petition in High Court.. రేణుకా స్వామి హత్య కేసులో జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు కన్నడ స్టార్ నటుడు దర్శన్. అయితే తనకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు...

Darshan files petition in High Court.. రేణుకా స్వామి హత్య కేసులో జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు కన్నడ స్టార్ నటుడు దర్శన్. అయితే తనకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు...

కోర్టుకి దర్శన్ స్పెషల్ రిక్వెస్ట్! ఆ సౌకర్యాలు కావాలంటూ పిటిషన్!

ప్రియురాలు పవిత్రగౌడను అసభ్యకరమైన సందేశాలు పంపేశాడన్న కారణంతో రేణుకా స్వామి అనే వ్యక్తిని చంపి జైలు పాలయ్యాడు కన్నడ సూపర్ స్టార్ దర్శన్. జూన్ 9న జరిగిన ఈ ఘటనలో పలువుర్ని అరెస్టు చేయడం.. తీగలాగితే డొంక కదిలినట్లు దర్శన్ పేరు బయటకు రావడంతో అతడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వరుసగా అరెస్టుల పర్వం చోటుచేసుకుంది. పవిత్ర గౌడతో సహా 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కన్నడ సీమ ఉలిక్కి పడింది. కేవలం శాండిల్ వుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రేణుకా స్వామిని అత్యంత ఘోరంగా, విచక్షణా రహితంగా దాడి చేశారు దర్శన్ అండ్ టీం.

ఈ కేసులో దర్శన్‌తో పాటు ప్రేయసి పవిత్రగౌడలకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి.. పట్టుపరుపులపై పవళించిన దర్శన్.. ఇప్పుడు జైలులో అత్యంత సాధారణ ఖైదీలా నేలపై పడుకోవాలంటే ఇబ్బంది పడుతున్నాడు. దీంతో తనకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైలులో ఆహారాన్ని తినలేకపోతున్నానని, ఇంట్లో వండిన ఆహారాన్ని అనుమతించేలా జైలు అధికారులను ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనకు చాక్, దుస్తులు, పురుపు, పుస్తకాలను కూడా అందించాలని కోరాడు. జైలులో అందించిన ఆహారం తిని జీర్ణించుకోలేక అనేక కిలోల బరువు తగ్గానని దర్శన్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

తాను డయేరియాతో బాధపడుతున్నానని, జైలులో ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు వైద్యులు కూడా పేర్కొన్నట్లు తెలిపాడు. అయితే ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపినట్లు తెలుస్తోంది. వాదనలు విన్న కోర్టు పిటిషన్ విచారణను జులై 18కి వాయిదా వేసింది. కేసులో ఇప్పటి వరకు 17 మంది అరెస్టు అయ్యారు. వీరందరికీ జులై 18 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఈ లెక్కన 18వరకు ఆయన జైలు కూడు తినాల్సిందే. ప్రస్తుతం నిందితులంతా పరప్పన్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే దర్శన్ కోసం భార్య విజయలక్ష్మీ పోరాడుతుంది. జైలులో ఉన్న దర్శన్‌ను చూసేందుకు కొడుకు వినీష్ తో కలిసి వెళ్లింది. బెడ్ షీట్, డ్రైప్రూట్స్, స్నాక్స్ తీసుకువచ్చింది. కోర్టు అనుమతి లేనిదే ఇంటి ఫుడ్ తీసుకురావడానికి అనుమతి లేనందున పండ్లు మాత్రమే అనుమతించారు. ఇటు పవిత్ర గౌడ దగ్గరకు ఇప్పటికే పలుమార్లు వచ్చి వెళ్లింది ఆమె కూతురు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి