Krishna Kowshik
రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం పరప్పన్ జైలులో జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన జ్యుడిషియల్ కస్టడీ ఆగస్టు 1 వరకు పొడిగిచింది స్థానిక కోర్టు. దీంతో ఆయన నటిస్తున్న ఈ మూవీ హోల్డ్ అయ్యింది. ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కడంపై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది.
రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం పరప్పన్ జైలులో జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన జ్యుడిషియల్ కస్టడీ ఆగస్టు 1 వరకు పొడిగిచింది స్థానిక కోర్టు. దీంతో ఆయన నటిస్తున్న ఈ మూవీ హోల్డ్ అయ్యింది. ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కడంపై ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Krishna Kowshik
రేణుకా స్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు కన్నడ సినీ ప్రేక్షకుల ఆరాధ్య నటుడు, డీ బాస్ దర్శన్ తూగదీప. ప్రియురాలు పవిత్రగౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడన్న విషయం దర్శన్‌కు తెలిసి.. తన అభిమానుల సహాయంతో రేణుకా స్వామిని చిత్రదుర్గ నుండి బెంగళూరుకు తెప్పించి.. అత్యంత ఘోరంగా కొట్టి చంపిన సంగతి విదితమే. మృతదేహం లభ్యం కావడంతో తీగ లాగితే డొంక కదిలినట్లు దర్శన్, అతడి ప్రియురాలు పవిత్రగౌడల పేర్లు వచ్చాయి. వెంటనే అరెస్టుల పర్వం మొదలైంది. ఈ ఛాలెంజింగ్ స్టార్ అరెస్టు కన్నడ ఇండస్ట్రీనే కాదు.. యావత్ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. జూన్ 11న పోలీసులు దర్శన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన ఏ 2 నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ ఎఫెక్ట్ ఆయన సినిమాపై పడింది.
రేణుకా స్వామి హత్య కేసులో మొత్తం 17 మంది పోలీసులు అరెస్టు చేశారు. 13 మంది పరప్పన్ జైలులో.. మరో నలుగురు తమకూరు జైలులో ఉన్నారు. తాజాగా వీరి జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 1 వరకు పొడిగించింది స్థానిక కోర్టు. దీంతో అతడు నటిస్తున్న డెవిల్ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తిరిగి షూటింగ్ షెడ్యూల్ కావడం కూడా ఆగమ్యగోచరంగా మారింది. అయితే దర్శన్ కేసులో నిందితుడు అయినప్పటికీ.. అభిమానుల్లో ఆయన పట్ల పాజిటివిటీ నెలకొంది. అతడు సినిమా రీ రిలీజ్ దగ్గర నుండి జైలులో ఇచ్చే ఖైదీ నంబర్ వరకు ట్రెండ్ చేశారు కర్ణాటక ప్రజలు. ఈ నేపథ్యంలో డెవిల్ షూటింగ్‌పై ఆసక్తి నెలకొంది. బెయిల్ రాకపోవడం, జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుతో హీరో ఎప్పుడు జైలు నుండి తిరిగి వస్తాడో, ఈ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తాడో అన్న చర్చ నడుస్తుంది.
అయితే ఇప్పుడు ఈ టాపిక్.. సంజయ్ దత్ ఘటనతో ముడిపెడుతున్నారు కొందరు. ముంబయి పేలుళ్ల సమయంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కు ఐదేళ్లు జైలు శిక్ష పడింది. అప్పుడు కూడా ఆయన చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. దీంతో కోర్టు పర్మిషన్ తీసుకుని జంజీర్‌తో పాటు పోలీస్ గిరి చిత్రాల్లో నటించాడు. జైలు శిక్షను అనుభవిస్తూనే ఈ రెండు సినిమాలు పూర్తి చేశాడు సంజయ్ దత్. ఇప్పుడు ఇదే అంశాన్ని దర్శన్‌తో పోలుస్తున్నారు. దర్శన్‌కు బెయిల్ వస్తే పర్వాలేదు కానీ.. జైలు శిక్ష పడితే మాత్రం పెరోల్ తీసుకుని డెవిల్ పూర్తి చేసే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పట్లో అది సాధ్యం కాదని న్యాయవాదులు చెబుతున్నారు.
దర్శన్ పై చార్జీషీటు దాఖలు తర్వాత కోర్టులో వాదనలు జరుగుతాయని, ఒక వేళ హీరో దోషిగా తేలితే.. పెరోల్ తీసుకుని కేవలం పూర్తి చేయని సినిమాలు షూటింగ్స్ చేయొవచ్చునని అంటున్నారు. చార్జిషీట్ సమర్పించేంత వరకు వేచి చూడాల్సిందేనని లాయర్లు చెబుతున్నారు. కాటేరా తర్వాత.. అదే నిర్మాలు డెవిల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ దర్శకుడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రచనా రాయ్ హీరోయిన్. 19 ఏళ్ల తర్వాత మహేష్ మంజ్రేకర్ కన్నడ చిత్రంలో నటించబోతున్నాడు. అన్ని సవ్యంగా జరిగి ఉంటే .. ఈ ఏడాది డిసెంబర్‌లో మూవీ రావాల్సి ఉంది.