iDreamPost
android-app
ios-app

Salaar: సలార్‌పై షాకింగ్‌ కామెంట్లు చేసిన స్టార్‌ హీరో!

  • Published Dec 15, 2023 | 11:24 AM Updated Updated Dec 15, 2023 | 11:24 AM

సలార్‌ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశ వ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదల కానుంది. అయితే, సలార్‌ మూవీపై ప్రముఖ స్టార్‌ హీరో షాకింగ్‌ కామెంట్లు చేశారు.

సలార్‌ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశ వ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదల కానుంది. అయితే, సలార్‌ మూవీపై ప్రముఖ స్టార్‌ హీరో షాకింగ్‌ కామెంట్లు చేశారు.

  • Published Dec 15, 2023 | 11:24 AMUpdated Dec 15, 2023 | 11:24 AM
Salaar: సలార్‌పై షాకింగ్‌ కామెంట్లు చేసిన స్టార్‌ హీరో!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- కేజీఎఫ్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్‌’ మూవీ విడుదలకు కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. ఈ చిత్రం డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్‌ అవ్వనుంది. సలార్‌ను కేజీఎఫ్‌ చిత్రాలను నిర్మించి కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ తెరకెక్కించింది. దీంతో కన్నడ నాట భార సంఖ్యలో థియేటర్లలో విడుదల కానుంది.

అయితే, డిసెంబర్‌ 29న కన్నడ నాట స్టార్‌ హీరో దర్శన్‌ సినిమా రిలీజ్‌ అవ్వనుంది. ‘కంటీర’ అనే మూవీ దర్శన్‌ కన్నడ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిత్ర షూటింగ్‌ ఇప్పటికే పూర్తయింది. టీం ప్రమోషన్లలో బిజీ అయింది. తాజాగా, కంటీర మూవీ టీం విలేకరుల సమావేశంలో పాల్గొంది.  ఈ సందర్భంగా దర్శన్‌కు సలార్‌, డంకీ మూవీల గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ‘‘ కొన్ని రోజులు అటు ఇటుగా ఈ రెండు ప్యాన్‌ ఇండియా సినిమాలు కన్నడనాట విడుదల అవుతున్నాయి కదా.. మీకు భయంగా లేదా?..

రిలీజ్‌ డేట్‌ను మార్చుకుంటారా?’’ అని ఓ రిపోర్టర్‌ ప్రశ్నంచ సంధించారు. దీనికి దర్శన్‌ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ 29 వస్తున్నాం.. మన సినిమా, మన ఊరు..  ఎవరికో భయపడి మనం ఎందుకు దూరంగా పారిపోవాలి. మన ఇంటికి రావాలంటే.. వాళ్లకు భయముండాలి. మనకు ఎందుకు భయం. కన్నడ నాటలో ఉ‍న్నానో.. లేదో అన్న భయం వేస్తోంది. సినిమా బాగుంటే కన్నడ ప్రేక్షకులే చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకెళతారు. ప్యాన్‌ ఇండియా అక్కర్లేదు.

ఇదో అచ్చ కన్నడ సినిమా.. కన్నడ ప్రజల కోసం అని చెబుతున్నా’’ అన్నారు. దర్శన్‌ నేరుగా సలార్‌ మూవీ పేరును తీయకపోయినా.. ఈ వ్యాఖ్యలు అన్నది కచ్చితంగా సలార్‌ గురించేనన్న ప్రచారం సోషల్‌ మీడియాలో గట్టిగా జరుగుతోంది. అయితే, సలార్‌ కూడా కన్నడ సినిమా కందికే వస్తుందని కొంతమంది అంటున్నారు. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌  కన్నడ దర్శకుడు. నిర్మాత కూడా కన్నడ వాడే.. అయినప్పుడు అది కచ్చితంగా కన్నడ సినిమా అవుతుందని అంటున్నారు.

ఇంకా కొంతమంది దర్శన్‌ మాటల్ని తప్పుబడుతున్నారు. సినిమా ఏ భాషకు చెందినది అయినా.. ముందు గౌరవించటం నేర్చుకోవాలని అంటున్నారు. మాట్లాడేముందు ఆచితూచి మాట్లాడాలని లేదంటే.. ఇబ్బంది పడాల్సి వస్తుందని హితవు పలుకుతున్నారు. మరి, కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌.. సలార్‌, డంకీ సినిమాలపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio