iDreamPost
android-app
ios-app

Darshan: దర్శన్‌పై సుమలత సంచలన లేఖ.. నా కొడుకుతో సమానం అంటూ

  • Published Jul 05, 2024 | 8:32 AM Updated Updated Jul 05, 2024 | 8:32 AM

దర్శన్‌ అరెస్ట్‌ విషయంలో సెలబ్రిటీలు స్పందిస్తుండగా.. తాజాగా సీనియర్‌ నటి, రాజకీయ నాయకురాలు సుమలత సంచలన లేఖ రాశారు. ఆ వివరాలు..

దర్శన్‌ అరెస్ట్‌ విషయంలో సెలబ్రిటీలు స్పందిస్తుండగా.. తాజాగా సీనియర్‌ నటి, రాజకీయ నాయకురాలు సుమలత సంచలన లేఖ రాశారు. ఆ వివరాలు..

  • Published Jul 05, 2024 | 8:32 AMUpdated Jul 05, 2024 | 8:32 AM
Darshan: దర్శన్‌పై సుమలత సంచలన లేఖ.. నా కొడుకుతో సమానం అంటూ

కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా వేదికగా తన ప్రియురాలిని వేధించాడనే కారణంతో.. అతడిని అత్యంత దారుణంగా హత మార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్శన్‌తో పాటు అతడి ప్రియురాలు పవిత్ర గౌడ కూడా అరెస్ట్‌ అయ్యింది. ప్రస్తుతం ఇద్దరు జైలులో ఉన్నారు. రెండు రోజుల క్రితం దర్శన్‌ను చూడటం కోసం అతడి తల్లి జైలుకు వెళ్లింది. అమ్మను చూసి దర్శన్‌ విపరీతంగా ఏడ్చాడని పోలీసులు అధికారులు చెప్పుకొచ్చారు. ఇలా ఉండగా.. కన్నడ సీమలో దర్శన్‌కు మద్దతిచ్చే అభిమానులు భారీగా పెరుగుతున్నారు. ఈ క్రమంలో సీనియర్‌ నటి సుమలత దర్శన్‌ గురించి రాసిన లేఖ వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ఆటో డ్రైవర్‌ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా దర్శన్‌ (ఏ2), నటి పవిత్ర (ఏ1) ఉన్నారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు. ఇప్పటికే దర్శన్‌ అరెస్ట్‌ విషయంలో చాలామంది నటీనటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దర్శన్‌ను ఉద్దేశిస్తూ.. రాజకీయ నాయకురాలు, సీనియర్‌ నటి సుమలత సంచలన లేఖ రాసింది. దానిలో దర్శన్‌ను తన కొడుకుగా చెప్పుకొచ్చింది. దర్శన్‌ను అంబరీష్‌ తన తండ్రిగా భావించేవాడు అని చెప్పుకొచ్చింది. అంతేకాక దర్శన్‌ హీరోగా మారక ముందు నుంచే తమకు తెలుసని.. 25 ఏళ్లుగా అతడితో తమ కుటుంబానికి అనుబంధం ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె రాసిన లేఖ నెట్టింట వైరల్‌గా మారింది.

‘‘నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నాను. ఐదేళ్లపాటు ఎంపీగా పని చేశా. అనేక రంగాల్లో బాధ్యతలు నిర్వహించాను. అనవసర వ్యాఖ్యలు చేయను. నా కుటుంబం, దర్శన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం మీకు అర్థం కాదు. అతను స్టార్ కాకముందు నుంచి సుమారు 25 ఏళ్లుగా నాకు తెలుసు. స్టార్‌డమ్‌కి మించి దర్శన్‌తో మాకు అనుబంధం ఉంది. తను నాకు కుటుంబ సభ్యుడు, కొడుకు లాంటివాడు. అంబరీష్‌ని ఎప్పుడూ నాన్న అని పిలిచి.. తన జీవితంలో నాకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఏ తల్లి తన కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూడడానికి ఇష్టపడదు’’ అని లేఖలో చెప్పుకొచ్చింది. .

‘‘నాకు తెలిసిన దర్శన్ ఎప్పుడూ ఇలాంటి నేరం చేయడు. దర్శన్‌లో ప్రేమ, ఉదార ​​హృదయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే సంకల్పం ఉన్నవాడు. దర్శన్ ఇలాంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను నమ్ముతున్నాను’’ అని సుమలత తన లేఖలో రాశారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను అని చెప్పుకొచ్చారు.

దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిపై సుమలత అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారిని విమర్శిస్తూ సుమలత తన లేఖను ముగించారు. ‘‘దర్శన్ ఇప్పటికీ నిందితుడే.. అతనికి వ్యతిరేకంగా ఏదీ నిరూపించబడలేదు, శిక్షించబడలేదు. దర్శన్‌ విషయంలో న్యాయమైన విచారణ జరగనివ్వండి. దర్శన్‌ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడకండి. ఈ కేసు వల్ల ఇప్పటికే శాండల్‌వుడ్‌ స్థంభించిపోయింది’’ అని రాసుకొచ్చారు.