iDreamPost
android-app
ios-app

స్పెషల్ పర్సన్ పై ప్రభాస్ మరో పోస్ట్.. ఆ బుజ్జి ఎవరంటే?

  • Published May 17, 2024 | 8:42 PM Updated Updated May 17, 2024 | 8:42 PM

Darling Prabhas New Post On Someone Special: డార్లింగ్ ప్రభాస్ పేరు ఉదయం నుంచి ఫుల్ ట్రెండ్ అవుతూ ఉంది. ఒక స్పెషల్ పర్సన్ అనగానే అంతా వదినమ్మ అనుకున్నారు. కానీ, ఆ స్పెషల్ ఏంటి? అసలు ఆ పోస్ట్ ఎందుకు పెట్టాడు. అసలు కథ ఏంటో స్వయంగా ప్రభాసే చెప్పేశాడు.

Darling Prabhas New Post On Someone Special: డార్లింగ్ ప్రభాస్ పేరు ఉదయం నుంచి ఫుల్ ట్రెండ్ అవుతూ ఉంది. ఒక స్పెషల్ పర్సన్ అనగానే అంతా వదినమ్మ అనుకున్నారు. కానీ, ఆ స్పెషల్ ఏంటి? అసలు ఆ పోస్ట్ ఎందుకు పెట్టాడు. అసలు కథ ఏంటో స్వయంగా ప్రభాసే చెప్పేశాడు.

  • Published May 17, 2024 | 8:42 PMUpdated May 17, 2024 | 8:42 PM
స్పెషల్ పర్సన్ పై ప్రభాస్ మరో పోస్ట్.. ఆ బుజ్జి ఎవరంటే?

డార్లింగ్ ప్రభాస్.. ఉదయం నుంచి పాన్ ఇండియా లెవల్లో సోషల్ మీడియాలో ఈ పేరు తెగ వైరల్ అవుతోంది. అందుకు ఒకే ఒక్క కారణం.. ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ పెట్టిన ఒక స్టోరీనే. కేవలం ఒకే ఒక్క స్టోరీతో ఇన్ స్టాగ్రామ్ ని డార్లింగ్ ప్రబాస్ షేక్ చేసి పడేశాడు. అందరూ ఉదయం నుంచి ఆ పోస్ట్ ఎవరి కోసం? ఆ స్పెషల్ పర్సన్ ఎవరు? అసలు ఆ పోస్ట్ పెళ్లి గురించేనా? ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా? అబ్బో ఇలా ఒకటి కాదు రెండు కాదు.. చాలా ప్రశ్నలతో బుర్రలు వేడెక్కిపోతున్నాయి. కొంతమంది అయితే ఈ పోస్టుకు సంబంధించి పెద్దఎత్తున డిబేట్లు కూడా పెట్టేశారు. ఎట్టకేలకు ప్రభాసే ఆ చిక్కుముడిని విప్పేశాడు. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో క్లారిటీ ఇచ్చేశాడు.

పాన్ వరల్డ్ హీరో ప్రభాస్ పెట్టిన ఒక ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పెద్దఎత్తున చర్చలకు, డిబేట్లకు దారి తీసిన విషయం తెలిసిందే. అందరికీ ఒక సర్ ప్రైజ్ ఉందని.. స్పెషల్ పర్సన్ ని పరిచయం చేస్తానంటూ పోస్ట్ పెట్టేశాడు. అది చూసిన ఫ్యాన్స్ అంతా వదినను పరిచయం చేస్తాడా? పెళ్లి చేసుకోబోతున్నాడా? అసలు ఆ పోస్ట్ ఎవరికోసం అని అంతా తలలు పగలు కొట్టేసుకున్నారు. “డార్లింగ్స్.. ఎట్టకేలకు మన జీవితాల్లోకి ఒక ప్రత్యేకమైన వాళ్లు రాబోతున్నారు.. వెయిట్ చేయండి” అని చెప్పాడు. అయితే ఆ పోస్టుని డీకోడ్ చేయడానికి చాలానే కష్ట పడ్డారు. ఆఖరికి ఆ పోస్టుకు అసలు అర్థాన్ని కూడా ప్రభాసే తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వివరించాడు.

ప్రభాస్ మొదటి పోస్టు పెట్టి.. దాదాపు 8 గంటల తర్వాత ఉత్కంఠకు తెరదించాడు. అయితే ఆ స్పెషల్ వన్ వదిన అని అనుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ పోస్ట్ పెట్టింది సినిమా ప్రమోషన్ కి సంబంధించి. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి పార్ట్ 1కి సంబంధించి ఒక స్పెషల్ అప్ డేట్ ని రివీల్ చేశారు. ఇప్పటికే కల్కీ మూవీకి సంబంధించి యానిమేటెడ్ వర్షన్ లో 4 ఎపిసోడ్లు విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ ఎపిసోడ్ కి సంబంధించే ఈ అప్ డేట్ ఇచ్చారు. ఆ సంవన్ స్పెషల్ వ్యక్తి కాదు. కల్కి సినిమాలో ప్రభాస్ వాడే కారు. అవును.. మీరు చదివింది నిజమే కల్కి సినిమాలో ప్రభాస్ వాడే ఒక ఫ్యూచరిస్టిక్ కారు పేరు బుజ్జీగా చెప్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)

sKratch ఎపిసోడ్ 4 మే 18 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నాం అంటూ అసలు విషయాన్ని వెల్లడించాడు. ఆ పోస్ట్ సినిమా ప్రమోషన్ కోసమని తెలుసుకుని డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త డీలా పడిపోయారు. కానీ, వెంటనే తేరుకుని కల్కి సినిమా అప్ డేట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మే 18 సాయంత్రం 5 గంటలు ఎప్పుడు అవుతుందా అని ఇప్పటి నుంచే ఎదురుచూపులు స్టార్ట్ చేసేశారు. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్.. బుజ్జిని కలుసుకోవాలి అని వీళ్లు కూడా ఉవ్విళ్లూరుతున్నారు. మరి.. ప్రభాస్ చెప్పిన ఆ బుజ్జి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio