iDreamPost
android-app
ios-app

పూరి మాస్టర్ ప్లాన్.. ఏకంగా ప్రభాస్ నే లైన్ లో పెట్టేశాడు!

  • Published Aug 03, 2024 | 2:54 PM Updated Updated Aug 03, 2024 | 2:54 PM

Is Darling Prabhas Attending Double Ismart Pre Release Event: పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడని చెబుతున్నారు.

Is Darling Prabhas Attending Double Ismart Pre Release Event: పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడని చెబుతున్నారు.

  • Published Aug 03, 2024 | 2:54 PMUpdated Aug 03, 2024 | 2:54 PM
పూరి మాస్టర్ ప్లాన్.. ఏకంగా ప్రభాస్ నే లైన్ లో పెట్టేశాడు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా ప్రేక్షకులు ఆగస్టు 15 కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి పంద్రాగస్టుకు చాలానే సినిమాలు బరిలో నిలుస్తున్నాయి. ఆ లిస్టులో పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ కూడా ఉంది. ఈ మూవీపై మేకర్స్ మాత్రమే కాదు.. అభిమానులకు కూడా గట్టిగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుటు ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అంతేకాకుండా.. ఈ మూవీ విషయంలో పూరీ జగన్నాథ్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాడు అని చెబుతున్నారు.

పూరీ జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా చేస్తోంది. కథ, టేకింగ్, డైలాగ్స్ ఇలా అన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న పూరీ జగన్నాథ్ ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ట్రైలర్ రిలీజ్ ని ఆగస్టు 4న వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారంట. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అంతకు మించి నిర్వహించాలి అని ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నారు. పూరీ జగన్నాథ్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డార్లింగ్ ప్రభాస్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

Prabhas

ప్రభాస్ కెరీర్ లో పూరీ జగన్నాథ్ తో కలిసి బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు చేశాడు. ప్రభాస్ కు మాస్ ఇమేజ్ తీసుకురావడంలో ఆ మూవీస్ కీలకంగా వ్యవహరించాయి. అలాగే బుజ్జిగాడు మూవీ నుంచే ప్రభాస్ అందరి డార్లింగ్ గా మారిపోయాడు. అప్పటి నుంచే పూరీ జగన్నాథ్ కు ప్రభాస్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే డబుల్ ఇస్మార్మ్ మరో ప్రొడ్యూసర్ అయిన చార్మీతో కూడా ప్రభాస్ కు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉంది. చక్రం, పౌర్ణమి సినిమాల్లో చార్మి.. ప్రభాస్ సరసన నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి నిర్మిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్ కాబట్టి.. ఆ ఇద్దరి కోసం ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తప్పకుండా వస్తాడు అని చెబుతున్నారు. అసలే డార్లింగ్ ప్రభాస్ ఎంతో మొహమాటస్తుడు అంటారు. అంత కావాల్సిన వాళ్లు అడిగితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకుండా ఉంటాడా? తప్పకుండా వస్తాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. పూరి కోసం ప్రభాస్ వస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabet